యాప్నగరం

#Me Too: వాళ్లు చేయమంటే మీరు చేస్తారా?: యాంకర్ అనసూయ

ఇది సినిమా ఇండస్ట్రీలోనే కాదు ప్రతి చోట ఉంటుంది. పబ్లిసిటీ కోసమో మరోదాని కోసమో ఈ ఉద్యమాన్ని ఉపయోగించుకోవడం కరెక్ట్ కాదు. వాళ్లు చేయమన్నారు నేను చూశాను అంటే కాదు.. నీ అంతరాత్మకు తెలుసు ఏది తప్పు ఏది ఒప్పు అనేది దానికి అనుగుణంగా నడుచుకోవాలి.

Samayam Telugu 13 Oct 2018, 6:20 pm
గత కొన్నాళ్లుగా ‘మీటూ’ ప్రకంపనలు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. పలువురు హీరోయిన్లు, సింగర్స్, క్యారెక్టర్ ఆర్టిస్ట్.. ఇలా ఇండస్ట్రీకి చెందిన పలువురు మహిళలు తమపై జరిగిన వేధింపులను ఒక్కొక్కటిగా బయటకు తీసుకువస్తున్నారు. ఈ ఉద్యమం ఉధృతం అవుతున్న సందర్భంలో టాలీవుడ్ నటి, ప్రముఖ యాంకర్ అనసూయ ‘మీటూ’ ఉద్యమంపై స్పందించారు.
Samayam Telugu అనసూయ


‘మీటూ’ ఉద్యమంలో భాగంగా చాలా మంది తనకు జరిగిన వేధింపులను బహిర్గతం చేస్తున్నారు. చాలా సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అయితే ఎవరికైతే వేధింపులు జరిగాయో వాళ్లు మాత్రమే బయటకు వస్తే మంచిది. అనవసరంగా చిన్న విషయాన్ని పెద్దది చేసి రాద్ధాంతం చేయకూడదు. ‘మీటూ’ని మిస్ యూజ్ కాకుండా చేయకూడదు.

ఇది సినిమా ఇండస్ట్రీలోనే కాదు ప్రతి చోట ఉంటుంది. పబ్లిసిటీ కోసమో మరోదాని కోసమో ఈ ఉద్యమాన్ని ఉపయోగించుకోవడం కరెక్ట్ కాదు. వాళ్లు చేయమన్నారు నేను చూశాను అంటే కాదు.. నీ అంతరాత్మకు తెలుసు ఏది తప్పు ఏది ఒప్పు అనేది దానికి అనుగుణంగా నడుచుకోవాలి. మన గురించి మనకు మాత్రమే ఎక్కువ తెలుస్తోంది. మనల్ని మనమే కాపాడుకోవాలి. మీ ఇష్టాలేవో మీకు తెలుసు.. నన్ను నేను ఎలా కాపాడుకోవాలనేది ఆలోచించే వాళ్లకు మాత్రమే తెలుస్తోంది. చేసే పనిలో క్లారిటీ ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్ రావు అంటూ తన అభిప్రాయాన్ని వ్యక్తపరిచింది అనసూయ.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.