యాప్నగరం

అనసూయ vs ‘అర్జున్ రెడ్డి’ ఫ్యాన్స్ ట్వీట్ వార్

అర్జున్ రెడ్డి చిత్ యూనిట్‌కు యాంకర్ అనసూయ క్లాస్ పీకారు. దీంతో మీరా నీతులు చెప్పేది అన్నట్టుగా.. ఫ్యాన్స్ కొందరు..

TNN 31 Aug 2017, 1:07 pm
రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొడుతున్న అర్జున్ రెడ్డి సినిమా వివాదాలతో సహవాసం చేస్తోంది. వీహెచ్ వర్సెస్ రాంగోపాల్ వర్మ మధ్య ఇప్పటికే ఈ సినిమా విషయమై గొడవ జరగ్గా.. రాజమౌళి సహా ఎందరో సినీ ప్రముఖులు మూవీ బాగుందంటూ ప్రశంసలు గుప్పించారు. తాజాగా ఈ మూవీ వివాదంలో యాంకర్ అనసూయ తలదూర్చింది. చిత్ర యూనిట్‌పై ప్రశంసలు గుప్పిస్తూనే.. పబ్లిక్ ఫంక్షన్లలో వారు చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టింది. మీ ఇంట్లోని ఆడవాళ్లని ఎవరైనా తిడితే ఊరుకుంటారా? అమ్మను ఎవరైనా తిడుతుంటే.. ఫర్వాలేదు అనుకుంటారా? అంటూ చురకలు అంటించింది.
Samayam Telugu anchor anasuya tweets her opinion about arjun reddy movie
అనసూయ vs ‘అర్జున్ రెడ్డి’ ఫ్యాన్స్ ట్వీట్ వార్


లక్షలాది మంది సినిమాను ఇష్టపడుతున్నారు బాగానే ఉంది. ప్రయోగాలు చేయండి కాదనడం లేదు. కాకపోతే బాధ్యతగా వ్యవహరించండి అంటూ అనసూయ సలహా ఇచ్చింది. మీరు వాస్తవాలను గ్రహించాలనే తప్పితే.. ఈ విషయంలో రాద్ధాంతం చేసే ఉద్దేశమేం లేదని ట్వీట్ చేసింది. అమ్మనో, చెల్లినో తిడితే మీరు ఊరుకోనప్పుడు.. పరాయి ఆడవాళ్లతో మీరు అలా వ్యహరిస్తే ఎలా అని ప్రశ్నించింది.

#ArjunReddy #AbusingMother #NotCool #NeverCool Period. — Anasuya Bharadwaj (@anusuyakhasba) August 30, 2017
Everything is fine! But since when abusing your mother became a go-go?? Sure.. experiment.. explore..but how can you take your bearing(cont) — Anasuya Bharadwaj (@anusuyakhasba) August 30, 2017
..for granted dude!Its a blessing..to be celebrated..to be followed..by thousands and lakhs of people..but isnt it a greater responsibility? — Anasuya Bharadwaj (@anusuyakhasba) August 30, 2017
Abusing out of emotion is just ok..to certain extent.. but never comes a moment that you canNot control yourself!You loose control(cont) — Anasuya Bharadwaj (@anusuyakhasba) August 30, 2017
..only when you take 'it' for granted., and that 'it' becomes someone's mother,sister,wife?!! SHAME!!! LOSERS!!!! — Anasuya Bharadwaj (@anusuyakhasba) August 30, 2017
అర్జున్ రెడ్డి సినిమాపై అనసూయ చేసిన వ్యాఖ్యల పట్ల ఫ్యాన్స్ కొంత మంది మండిపడుతున్నారు. టీవీ షోల్లో మీరు ఎలాంటి దుస్తులు వేసుకొని వస్తున్నారంటూ దెప్పి పొడిచారు. జబర్దస్త్ షోలో ఆడవాళ్లపై వేస్తున్న కుళ్లు జోకుల సంగతి ఏంటని ప్రశ్నించారు. వీటికి కూడా అనసూయ గట్టిగానే బదులిచ్చారు.

From the moment when mothers like you started flaunting the meat on TV and media. Stop your stupid hypocrisy! — Manishi (@endhukureturns) August 30, 2017
If u don't want to make any issue then keep calm. what's this nonsense?In #Jabardast they are simply making fun on women's. — Bhargav Bondalapati (@bb468pja1) August 30, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.