యాప్నగరం

యాంకర్ రవి-లాస్య డిష్యుం.. డిష్యుం కంటిన్యూ!

ఇటీవల ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమా ఆడియో ఫంక్షన్‌లో చలపతిరావు మహిళలపై చేసిన అసభ్యకర వ్యాఖ్యలతో ఎంతగా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాడో.. ఆయన వ్యాఖ్యలను సపోర్ట్ చేస్తూ సూపర్ అని కామెంట్ చేసిన యాంకర్ రవి కూడా అదే స్థాయిలో విమర్శలను ఎదుర్కొంటున్నాడు.

TNN 26 May 2017, 9:39 pm

Samayam Telugu anchor lasya responds on ravi and chalapathi rao issue
యాంకర్ రవి-లాస్య డిష్యుం.. డిష్యుం కంటిన్యూ!

టెక్నికల్ ప్రాబ్లమ్స్ కారణంగా చలపతిరావు ఏం చెప్పారో.. తనకు వినపడలేదని, ఏదో పంచ్ వేసి ఉంటారనుకొని సూపర్ అన్నానని రవి కవర్ చేసుకొనే ప్రయత్నం చేసినా.. ఎవరికీ అది నమ్మే విధంగా లేదు. ఆ జాబితాలో యాంకర్ లాస్య కూడా ఉంది.

రవి కామెంట్స్‌ను, అతడి వాదనను తప్పుబడుతూ.. మ్యూజిక్ చానెల్‌లో పని చేసే ఓ వీజే చేసిన వీడియో బాగా పాపులర్ అయింది. దాదాపు యూట్యూబ్ లో 8 లక్షల వ్యూస్ వచ్చాయి. ఈ వీడియోను లాస్య షేర్ చేస్తూ ''బాగా చెప్పావ్.. నీ అభిప్రాయంతో ఏకీభవిస్తున్నా'' అని స్పందించడం విశేషం.

గతంలో రవి, లాస్య కలిసి చాలా ప్రోగ్రామ్స్ చేశారు. వీరిద్దరిదీ హిట్ పెయిర్. మధ్యంలో ఏవో గొడవల కారణంగా ఇద్దరి మధ్య మాటలు కూడా లేవని వార్తలు వినిపించాయి. ఆ తరువాత లాస్య పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయింది. ఈ నేపధ్యంలో ఆమె రవికి వ్యతిరేకంగా చేసిన వీడియోను షేర్ చేయడం చూస్తుంటే ఇద్దరి మధ్యా ఇంకా కోల్డ్ వార్ నడుస్తూనే ఉందనిపిస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.