యాప్నగరం

యాంకర్ ప్రదీప్ త్వరలోనే హీరో ప్రదీప్..!

బుల్లితెరపై తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ సంపాదించుకున్న టాప్ యాంకర్ ప్రదీప్ మాచిరాజు త్వరలోనే హీరో కానున్నాడట.

TNN 7 Dec 2022, 12:32 pm
తెలుగు నాట బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక క్రేజ్ సంపాదించుకున్న యాంకర్ ప్రదీప్ మాచిరాజు. హుందాగా ఉంటూ, తనదైన శైలిలో ఆకట్టుకునే యాంకర్‌గా అతడికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. భారీ రెమ్యూనరేషన్ అందుకుంటున్న టాప్ యాంకర్ అతడు. ప్రదీప్ గురించి ఓ వార్త బయటకు వచ్చింది. బుల్లితెర మీద సత్తా చాటిన ప్రదీప్ వెండితెరపై కూడా మెరవబోతున్నాడట. ఇప్పటికే అతడు కొన్ని సినిమాల్లో నటించాడు. కానీ హీరోగా మాత్రం చేయలేదు.
Samayam Telugu Pradeep
యాంకర్ ప్రదీప్ మాచిరాజు


త్వరలోనే ఓ సినిమాలో హీరోగా ప్రదీప్ నటించబోతున్నట్లు తెలుస్తోంది. డాన్స్ కొరియోగ్రాఫర్‌గా పేరున్న అజయ్ సాయి మణికందన్ దర్శకత్వంలో ప్రదీప్ సినిమా చేయబోతున్నట్లు ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం. ‘గడసరి అత్త సొగసరి కోడలు', ‘కొంచెం టచ్‌లో ఉంటే చెప్తా' లాంటి ప్రోగ్రాల ద్వారా మహిళా ప్రేక్షకులకు ప్రదీప్ దగ్గరయ్యాడు. దీంతో తన కామెడీ టైమింగ్, ఆడవాళ్లు ఇష్టపడే ఫ్యామిలీ సెంటిమెంట్ లాంటి అంశాలకు ఆ చిత్రంలో పెద్ద పీట వేస్తారట.

ఇప్పటికే ప్రి ప్రొడక్షన్ పనులు ప్రారంభం కాగా, వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి అధికారికంగా ఈ సినిమాను ప్రారంభిస్తారని తెలుస్తోంది. హీరోగానూ ప్రదీప్ చక్కటి విజయాల్ని అందుకోవాలని ఆశిద్దాం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.