యాంకర్ రష్మీ (Rashmi Gautam) తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది. అందులో ఓ కుక్క అపాయంలో పడినట్టు కనిపిస్తోంది. ప్లాస్టిక్ డబ్బాలోకి కుక్క తన మూతిని దూర్చింది. దాంట్లోంచి తన మూతిని బయటకు తీసుకురాలేక సతమతమైనట్టుంది. అయితే యానిమల్ రెస్క్యూ టీం వచ్చి ఆ కుక్కని కాపాడే ప్రయత్నం చేసింది. కానీ ఇంతలో ఓ వ్యక్తి మాత్రం వారించాడు. దీనిపై యాంకర్ రష్మీ అసహనం వ్యక్తం చేసింది. ఈ మాటలు సరిగ్గా వినండి.. రెస్క్యూ టీం ఆ కుక్కని కాపాడేందుకు ప్రయత్నిస్తోంది.. దాని మూతిని ఆ ప్లాస్టిక్ బాటిల్ నుంచి బయటకు తీసేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఒక వేళ వాళ్లు అలా చేయకపోతే ఆ కుక్క కాసేపట్లో చనిపోయేది.. కానీ ఈ వీడియోలో బ్యాక్ గ్రౌండ్‌లో ఓ అంకుల్ మాటలు వినండి.. ఆయన అపార్ట్మెంట్ దగ్గర ఇలాంటి పనులు చేయొద్దని వెళ్లిపోమ్మని అంటున్నాడు.. ఆ కుక్క పట్ల కనీసం జాలి కూడా లేకుండా.. అలా చెప్పేశాడు.. అందుకే మీకు ఈ వీడియోను మొత్తం పెడుతున్నాను..
మీరు కనీసం కుక్కకు అలాంటి పరిస్థితి వచ్చిందని యానిమల్ రెస్క్యూ టీంకు సమాచారం అందించండి చాలు.. వాళ్ల పనిని వాళ్లు చేయనివ్వండి.. కానీ ఇలాంటి అంకుల్‌లా మాత్రం వద్దని చెప్పకండి.. మూగ జీవాలను పరిరక్షించడం మన బాధ్యత అని యాంకర్ రష్మీ ఆవేదన చెందింది.
యాంకర్ రష్మీకి పెట్స్ అంటే ఎంత ఇష్టమో అందరికీ తెలిసిందే. మూగ జీవాల పరిరక్షణ కోసం యాంకర్ రష్మీ పాటు పడుతుంటుంది. మూగ జీవాల పట్ల అమితమైన ప్రేమను కురిపిస్తూ ఉంటుంది. జీవ హింస పాపమని యాంకర్ రష్మీ ఎప్పుడూ చెబుతూనే ఉంటుంది.