యాప్నగరం

Naga Babu: అమ్మాయిల డ్రెస్సింగ్‌పై నాగబాబు కామెంట్స్.. రష్మి పొగడ్తలు

పలానా హీరోయిన్ పొట్టి డ్రెస్ వేసుకుంది. క్యారెక్టర్ కోసం ఎట్రాక్ట్ చేస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారే.. అసలు మీ దృష్టి వాళ్ల డ్రెస్ మీదికి ఎందుకు వెళ్తుంది. మీ కళ్లు ఆమె డ్రెస్‌‌ని ఎందుకు చూస్తున్నాయ్.

Samayam Telugu 4 Feb 2019, 8:36 pm
జబర్దస్త్ జడ్జ్ నాగబాబుపై జబర్దస్త్ యాంకర్ రష్మి పొగడ్తల వర్షం కురిపించింది. మాకు అండగా నిలబడినందుకు ధన్యవాదాలు నాగబాబు గారు అంటూ ట్వీట్ చేసింది. ఇంతకీ నాగబాబు వ్యాఖ్యలు రష్మికి ఇంతగా ఎందుకునచ్చేశాయి... ఆయన ఏమన్నారు అంటే.. ఇటీవల గానగాంధర్వుడు ఎస్. పి బాలసుబ్రహ్మణ్యం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ హీరోయిన్స్ వస్త్రధారణపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సినిమా ఫంక్షన్లకు వచ్చే హీరోయిన్లు వేదికపైకి ఎలాంటి డ్రెస్‌లు వేసుకుని రావాలో తెలియదా.. అంగాంగ ప్రదర్శన చేస్తేనే ఆఫర్లు వస్తాయన ఇలా చేయడం తగదని.. భారతీయ విలువలు, సాంప్రదాయాలకు లోబడే మనం ప్రవర్తించాలని ఆరబోసే హీరోయిన్స్‌కి చురకలు అంటించారు.
Samayam Telugu నాగబాబు, రష్మి


దీనిపై మెగా బ్రదర్ నాగబాబు స్పందిస్తూ.. అసలు ఆడవాళ్ల డ్రెస్ గురించి మాట్లాడే అధికారం మీకు ఎవరు ఇచ్చారు. సాంప్రదాయం, మతం ముసుగులో కూర్చుని ఆడపిల్లలు ఇలాంటి డ్రెస్‌లు వేసుకోకూడదని చెప్తారా.. అలాంటి డ్రెస్‌ల వల్ల మగవాళ్ల కోరికలు పెరుగుతున్నాయి అంటారా.. మగవాడి కామదృష్టికి నీచమైన ఆలోచనకి శరీరాన్ని కప్పుకున్నా.. ఎక్స్‌పోజ్ చేసినా వాడి బుద్ది మారదు. అలాంటి వాళ్లకోసం మీరు డిక్టేట్ చేస్తారా?

పలానా హీరోయిన్ పొట్టి డ్రెస్ వేసుకుంది. క్యారెక్టర్ కోసం ఎట్రాక్ట్ చేస్తుంది అంటూ కామెంట్ చేస్తున్నారే.. అసలు మీ దృష్టి వాళ్ల డ్రెస్ మీదికి ఎందుకు వెళ్తుంది. మీ కళ్లు ఆమె డ్రెస్‌‌ని ఎందుకు చూస్తున్నాయ్. ఆ అమ్మాయి తొడలు కనిపిస్తున్నాయ్.. బొడ్డు కనిపిస్తుంది.. ఈ దృష్టి మీకు ఎందుకు వచ్చింది. ఏ మీరు చూడకుండా ఉండలేరా? ఫస్ట్ మీ వక్రబుద్ధి మార్చుకోండి. మీరు చూసే చూపుఉంటుందే ఆ నీచమైన చూపునుండి బయటపడండి. మీరు చూసేదంతా చూసేని చప్పలించేస్తారు. తరువాత స్టేజ్‌ల మీదికొచ్చి కబుర్లు చెప్తారు. ఆపండి సార్.. వాళ్లు నిజంగా ఒళ్లంతా విప్పుకుని రోడ్లుమీద తిరిగితే చట్టాలు ఉన్నాయి. వాళ్లు కూడా మగాళ్ల వస్త్రధారణపై కండిషన్ పెట్టి రోడ్డు ఎక్కితే దూలతీరిపోద్ది మీకు’ అంటూ ఫైర్ ఏ రేంజ్‌లో ఫైర్ అయ్యారు నాగబాబు.

ఇక నాగబాబు కామెంట్స్‌పై నెటిజన్లు ఓ రేంజ్‌లో మండిపడుతూ.. మంచి బట్టలేసుకోమనడం కూడా తప్పేనా అంటూ రివర్స్‌లో నాగబాబు పర్శనల్ లైఫ్ విషయాలను నెట్టింట్లో పెట్టేస్తున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ వివాదంలోకి ఎంట్రీ ఇచ్చేసింది జబర్దస్త్ యాంకర్ రష్మి. మా భలే అన్నారు నాగబాబు గారు.. లేకపోతే మా డ్రెస్‌ల గురించి మాట్లాడతారా? ఎంత ధైర్యం.. మాకు తెలియదా ఏ డ్రెస్‌లు వేసుకోవాలో ఎలా ఉండాలో అన్నంత రేంజ్‌లో ఓ ట్వీట్ వదిలింది.


‘మానవత్వం అనేది స్త్రీ, పురుషులు వేసుకునే బట్టల్ని బట్టి కాదు.. ధరించే దుస్తులకు మించి మనిషిలో ఎన్నో గొప్ప విషయాలుంటాయి. వాటిని వేసుకునే దుస్తుల దృష్టి నుంచి చూడటం మానేయండి. మహిళల వస్త్రధారణపై మాకు అండగా నిలిచిన మా జబర్దస్త్ జడ్జ్ నాగబాబు గారికి ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేసింది యాంకర్ రష్మి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.