హోలీ.. సామాన్యుల దగ్గర నుంచి సెలబ్రిటీల వరకు ఎంతో ఉత్సాహంగా జరుపుకునే రంగుల పండుగ. ఒంటినిండా రంగులు పూసుకుని సరదగా ఆడుకునే ఈ పండుగను వెండితెర, బుల్లితెర నటులు కూడా ఎంతో ఆనందంగా జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వారు తీసుకున్న ఫొటోలను సోషల్ మీడియాలో పెడుతున్నారు. ఈ మధ్య బుల్లితెరపై యాంకర్‌గా బాగా పాపులర్ అయిన శ్రీముఖి ట్విట్టర్లో చాలా యాక్టివ్‌గా ఉంటుంది. ఈరోజు హోలీ సందర్భంగా ఆమె తీసుకున్న కొన్ని ఫొటోలను ట్విట్టర్లో ఉంచింది. ముఖమంతా రంగులతో కప్పేసి గుర్తుపట్టలేనంతగా ఈ ఫొటోల్లో మారిపోయింది. అయితే ఆమె ట్వీట్ చేసిన మూడు ఫొటోల్లో ఒక ఫోటో మాత్రం మామూలాగే ఉంది. దీంతో అక్కడున్న మిగిలిన రెండు ఫొటోలు తనవేనని అర్థమవుతోంది. మొత్తానికి శ్రీముఖి విభిన్న శైలిలో హోలీ శుభాకాంక్షలు చెప్పింది.
Happy Holi everyone! #HappyHoli 😍 pic.twitter.com/5MRGtnRxyd — SreeMukhi (@MukhiSree) March 13, 2017
Happy Holi everyone! #HappyHoli 😍 pic.twitter.com/5MRGtnRxyd — SreeMukhi (@MukhiSree) March 13, 2017