యాప్నగరం

వన్స్ మోర్ ప్లీజ్!! ఉదయభాను ఈజ్ బ్యాక్

వన్స్ మోర్ ప్లీజ్.. సాహసం చేయరా డింభకా.. డాన్స్ బేబీ డాన్స్.. పిల్లలు పిడుగులు లాంటి ప్రోగ్రామ్స్‌తో పాపులర్ అయిన ఉదయభాను పలు ఆడియో వేడుకల్లో తనదైన మార్క్ యాంకరింగ్‌తో ప్రేక్షకుల్లో ఫుల్ జోష్ నింపేది.

TNN 17 Jul 2017, 7:53 pm
వన్స్ మోర్ ప్లీజ్.. సాహసం చేయరా డింభకా.. డాన్స్ బేబీ డాన్స్.. పిల్లలు పిడుగులు లాంటి ప్రోగ్రామ్స్‌తో పాపులర్ అయిన ఉదయభాను పలు ఆడియో వేడుకల్లో తనదైన మార్క్ యాంకరింగ్‌తో ప్రేక్షకుల్లో ఫుల్ జోష్ నింపేది. ఆ తరువాతి కాలంతో హీరోయిన్ ఎంట్రీ ఇవ్వడంతో పాటు.. రాజశేఖరా నీపై మోజు తీరలేదురా అంటూ ఐటమ్ సాంగ్‌‌లోనూ మెరిసింది. కెరియర్ పీక్ స్టేజ్‌లో ఉండగానే వివాహం చేసుకున్న ఈ హాట్ యాంకర్ తరువాతి కాలంలో పూర్తి సమయాన్ని కుటుంబానికి కేటాయిస్తూ యాంకరింగ్‌కు సినిమాలకు దూరమైంది.
Samayam Telugu anchor udaya bhanu at gautam nanda audio launch
వన్స్ మోర్ ప్లీజ్!! ఉదయభాను ఈజ్ బ్యాక్


అపుడెపుడో ‘రుద్రమదేవి’ ఆడియో వేడుకలో మళ్లీ మెరిసిన యాంకర్ ఉదయభాను తాజాగా గోపీచంద్ ‘గౌతమ్ నంద’ మూవీ ఆడియో వేడుకలో యాంకర్‌గా రీ ఎంట్రీ ఇచ్చింది. అంతేకాదు గోపీచంద్ ఫ్యాన్స్‌లో జోష్ నింపే విధంగా కట్టు బొట్టుతో యాంకరింగ్ చేసి ఆకట్టుకుంది. చాలా రోజుల తరువాత ఎంట్రీ ఇచ్చినా తనలో ఎక్కడా జోష్ తగ్గలేదని చెప్పడంతో పాటు బ్రైట్ సారీతో కుర్రాళ్ల మైండ్ బ్లాక్ అయ్యేట్లు చేసింది. అక్కడకు వచ్చిన ప్రేక్షకులనే కాకుండా ఈమె చీరకట్టు ప్రముఖ ఫైట్ మాస్టర్స్ రామ్ లక్షణ్‌లను వివరీతంగా ఆకట్టుకోవడంతో స్టేజ్ మీదే పొగడ్తలతో ముంచేశారు.

నిన్ను ఒకటి అడగాలంటూ.. ‘ నువ్వు ఆడియో ఫంక్షన్‌కి వస్తేనే బ్రైట్.. ఇక ఇలాంటి బ్రైట్ చీర కట్టుకు వస్తే కుర్రోళ్ల పరిస్థితేంటి ఇక' అనేశాడు ఈ ఫైట్ మాస్టర్. దీంతో కాసింత సిగ్గు పడిపోయిన ఈ సీనియర్ యాంకర్.. రెండు మూడేళ్లుగా గ్యాప్ తాను కనిపించలేదని.. చాలామంది కనిపించాల్సిందిగా అడుగుతున్నారంటూ చెప్పుకొచ్చింది. గతంలో రామ్ లక్ష్మణ్ లు హీరోలుగా చేసిన ‘ఖైదీ బ్రదర్స్’ మూవీలో ఉదయభాను హీరోయిన్‌గా చేయడంతో ఆ చనువుతో ఇలా కామెంట్స్ చేశారని తెలుస్తోంది. మొత్తానికి యాంకర్‌గా బుల్లి తెరను ఓ ఊపు ఊపిన ఉదయభాను.. మిగతా యాంకర్స్‌తో పోటీని తట్టుకుని మునుపటి స్పీడ్‌ను అందుకుంటుందో లేదో చూడాలి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.