యాప్నగరం

RIP Venu Madhav: వేణు మాధవ్ పార్థీవదేహం వద్ద విలపించిన ఉదయభాను

Comedian Venu Madhav: అన్నా.. నువ్ నన్ను సొంత చెల్లిలిగా చూసుకున్నావ్.. ఆపద వచ్చిందంటే సాయం చేయడానికి ముందుండే వాడివి. నువ్ లేని లోటు ఎవరూ పూడ్చలేనిది. ఇండస్ట్రీ గొప్ప నటుడ్ని కోల్పోయిందన్నా..

Samayam Telugu 26 Sep 2019, 8:39 pm
నవ్వుల వేణువు వేణు మాధవ్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతోంది టాలీవుడ్. సుమారు 23 ఏళ్లు పాటు ఇండస్ట్రీతో ప్రత్యేక అనుబంధాన్ని ఏర్పరచుకున్న కమెడియన్ వేణు మాధవ్ మరణం ఇండస్ట్రీ వర్గాలను కలచివేసింది. బుధవారం నాడు వేణు మాధవ్ ఆకస్మిక మరణించడంతో నేడు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం అభిమానులు.. సినీ, రాజకీయ ప్రముఖుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఫిలిం చాంబర్‌లో ఉంచారు.
Samayam Telugu RIP Venu Madhav
వేణు మాధవ్ భౌతికకాయం వద్ద విలపిస్తున్న ఉదయభాను


Read Also: వేణు మాధవ్ చివరి కోరిక తీర్చిన హైపర్ ఆది

నిన్నమొన్నటి వరకూ అందర్నీ నవ్విస్తూ.. నవ్వుతూ ఉంటే వేణు మాధవ్‌.. భౌతికకాయాన్ని చూసి కన్నీరు మున్నీరౌతున్నారు తోటి ఆర్టిస్టులు. ఆయన పార్థీవ దేహానికి నివాళులర్పించడానికి వచ్చిన ప్రముఖ యాంకర్, నటి ఉదయభాను కన్నీరు మున్నీరైంది.

Also Read: వేణుమాధవ్‌కు చిరంజీవి సహా ప్రముఖుల కన్నీటి నివాళి

‘నా అన్నయ్య వేణు మాధవ్‌ను ఇలా చూస్తానని ఊహించలేదు. నా కెరియర్ స్టార్టింగ్‌లో నన్ను సొంత చెల్లిలిగా చూసుకున్నాడు. ఇద్దరం కలిసి ‘వన్స్ మోర్ ప్లీజ్’ ప్రోగ్రామ్ చేసేవాళ్లం. చాలా అల్లరి చేసేవాళ్లం. అందరితో చాలా డిఫరెంట్‌గా ఉండే వారు కాని.. నన్ను సొంత చెల్లిని అన్న ఎలా ప్రొటక్ట్ చేస్తాడో నన్ను అలా చూసుకునేవాడు. తను తినడానికి తెచ్చుకున్నది నాకు పెట్టేవాడు. ఆయన ఎక్కడ ఉన్నా చాలా అల్లరిగా సరదాగా ఉండేవారు. చుట్టుపక్కల వాతావరణాన్ని తన నవ్వుతో మార్చేసేవాడు. ఎవరికైనా ఆపద ఉన్నా వెంటనే చలించేవారు. బంగారం లాంటి మనిషి ఆయన.

ఆరోగ్యం జాగ్రత్త అన్నా.. అని చాలా కాలంగా చెప్తునే ఉన్నాం. కాని ఇలా మనల్ని వదిలిపోవడం చాలా బాధాకరం. మా కుటుంబానికి వేణు అన్న మరణం తీరని లోటు. వేణు లాంటి ఆర్టిస్ట్ మళ్లీ పుట్టరు. ఆయన చేసే క్యారెక్టర్స్‌కి అన్యాయం జరిగినట్టే’ అంటూ తీవ్ర భావోద్వేగానికి లోనై ఏడ్చేశారు ఉదయభాను.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.