యాప్నగరం

Vishal: ‘డబ్బుతో విశాల్‌ను కొనేస్తున్నావ్, సిగ్గులేదు?’.. అనీషా జవాబు అదుర్స్!

విశాల్‌తో పెళ్లికి సిద్ధమవుతున్న అనీషాపై ఇన్‌స్టాగ్రమ్‌లో విమర్శలు ఎదురవ్వుతున్నాయి. విశాల్‌ను డబ్బుతో కొనేస్తున్నావంటూ విమర్శించిన ఓ యువతికి ఆమె ఇచ్చిన సమాధానం చూస్తే.. మెచ్చుకోకుండా ఉండలేరు.

Samayam Telugu 18 Jan 2019, 12:10 pm

ప్రధానాంశాలు:

  • హైదరాబాద్‌కు చెందిన వాణిజ్యవేత్త కుమార్తె అనీషా త్వరలో విశాల్‌ను పెళ్లాడనుంది.
  • ఈ సంర్భంగా సోషల్ మీడియాలో ఆమెపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu anisha-alla-vishal
ప్రముఖ నిర్మాత జీకే రెడ్డి తనయుడు, హీరో విశాల్‌కు హైదరాబాద్‌కు చెందిన ఓ వాణిజ్యవేత్త కుమార్తె అనీషాతో పెళ్లి నిశ్చయమైన సంగతి తెలిసిందే. అనీషా ఈ విషయాన్ని ఇన్‌స్టాగ్రమ్ ద్వారా తన ఫాలోవర్లతో పంచుకుంది. ఈ గుడ్‌న్యూస్ చూసి కొంతమంది ఆమెకు అభినందనలు తెలపగా.. మరికొందరు విమర్శలు చేయడం మొదలుపెట్టారు.
‘‘డబ్బుతో ఎవరైనా ముష్టొడిని కొనుకోవచ్చుగా.. విశాల్‌ను ఒంటరిగా వదిలేయ్? నీకు సిగ్గు లేదా B***’’ అంటూ ఓ యువతి ఇన్‌స్టాగ్రమ్‌లో దూషించింది. అయితే, ఈ విమర్శకు ఆమె చాలా కూల్‌గా సమాధానం చెప్పింది. ‘‘నా డబ్బు చూసే విశాల్ నన్ను పెళ్లి చేసుకుంటున్నాడని నువ్వు భావిస్తున్నావంటే.. నీకు విశాల్ మీద ఎంత గౌరవం ఉందో అర్థమవుతోంది. కొన్నిసార్లు జీవితంపై కూడా కొద్దిగా విశ్వాసం ఉంచండి. ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది. టేక్ కేర్’’ అని అనీషా సమాధానం ఇచ్చింది.
ఆ సమాధానం చూసిన ఆమె ఫాలోవర్లు అనీషాను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. చాలా చక్కగా బదులిచ్చావని ప్రశంసిస్తున్నారు. అటువంటి విమర్శలు (ట్రోల్స్) పట్టించుకోవద్దని సూచిస్తున్నారు. దీంతో అనీషా కూడా కొన్ని విమర్శలను లైట్‌గా తీసుకుంటోంది. ఏది ఏమైనా మన ‘పందెం కోడి’కి సరైన జోడీయే దొరికింది అనిపిస్తోంది కదూ. హీరో విశాల్‌.. తెలుగువాడైనా, తమిళ సినిమాల్లోనే ఎక్కువగా గుర్తింపు వచ్చింది. అంతేకాదు, విశాల్ నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శిగా కొలీవుడ్‌లో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
View this post on Instagram #YouAndMe #Lifehouse #LoveAlways #Vishal A post shared by Anisha Alla (@bluewatermelon17) on Jan 2, 2019 at 7:02am PST

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.