యాప్నగరం

'కాటమరాయుడు' వెలుగువైపు మరో అడుగు

'కాటమరాయుడు' బయలు దేరాడు. కొత్త సంవత్సరంలో తన భక్తులకు కొత్త వెలుగులు తీసుకొచ్చే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాడు... పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కాటమ రాయుడు...

TNN 29 Dec 2016, 1:38 pm
'కాటమరాయుడు' బయలు దేరాడు. కొత్త సంవత్సరంలో తన భక్తులకు కొత్త వెలుగులు తీసుకొచ్చే దిశగా అడుగులు ముందుకు వేస్తున్నాడు... అనిపించేలా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న కాటమ రాయుడు పోస్టర్ గ్లింప్స్ ఒక్కొక్కటిగా రిలీజ్ అవుతున్నాయి. బుధవారం సాయంత్రం పవన్ నడుస్తున్నట్లుగా కొద్దిగా చూపించే పోస్టర్ రిలీజ్ చేయగా , ఇప్పుడు అలాంటిదే మరో పోస్టర్ రిలీజ్ చేశారు. ఇలా నూతన సంవత్సర శుభాకాంక్షలు చెప్తూ రిలీజ్ అవుతున్న ఈ పోస్టర్లు డిసెంబర్ 31 వరకు ఇలాగే విడుదల చేస్తూ , జనవరి 1న కాటమ రాయుడు టీజర్‌తో పవన్ కళ్యాణ్ ఫుల్ కటౌట్‌తో వచ్చేస్తున్నట్లు తెలుస్తోంది.
Samayam Telugu another glimplse of pawan kalyans katamarayudu is unveiled
'కాటమరాయుడు' వెలుగువైపు మరో అడుగు




పవన్ కళ్యాణ్ , శృతి హాసన్ కాంబినేషన్‌లో దర్శకుడు కిషోర్ కుమార్ పార్దసాని (డాలీ) 'కాటమ రాయుడు'. సినిమాను తెరకెక్కిస్తున్నారు. అనూప్ రూబెన్స్ మ్యూజికల్‌తో వస్తున్న ఈ సినిమాను నార్త్ స్టార్ ఎంటర్ టైన్మెంట్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ పంచె కట్టులో మాస్ లుక్‌తో కనిపిస్తున్న ఈ సినిమాపై అతిభారీ అంచనాలు ఉన్నాయి. అంతేకాకుండా తమిళంలో సూపర్ హిట్ అయిన 'వీరమ్' అనే మాస్ యాక్షన్ ప్యాక్ సినిమాకు ఈ సినిమా రీమేక్‌గా చెప్తున్నారు. తెలుగు సంవత్సరాది ఉగాది రోజున 'కాటమరాయుడు' ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.