యాప్నగరం

చెర్రీతో జోడీకడుతోన్న అనుపమ

మెగాపవర్ స్టార్ రాంచరణ్ ధృవ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన జోష్‌లో ఉన్నాడు. ఆ సినిమా విజయాన్ని పూర్తిగా ఆస్వాదించకుండానే నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టాడు.

TNN 17 Dec 2016, 9:13 pm
మెగాపవర్ స్టార్ రాంచరణ్ ధృవ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన జోష్‌లో ఉన్నాడు. ఆ సినిమా విజయాన్ని పూర్తిగా ఆస్వాదించకుండానే నెక్స్ట్ సినిమాపై ఫోకస్ పెట్టాడు. ఈ మెగా హీరో ధృవ తర్వాత సుకుమార్ దర్శకత్వంలో పనిచేయడానికి రెడీ అయ్యాడు. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తయిన ఈ సినిమాకు ప్రస్తుతం నటీనటుల ఎంపిక జరుగుతోంది.
Samayam Telugu anupama parameswaran in ram charan sukumar movie
చెర్రీతో జోడీకడుతోన్న అనుపమ


పీరియాడిక్ జానర్‌లో పల్లె వాతావరణంలో తెరకెక్కుతున్న ఈ మూవీకి హీరోయిన్‌గా ఎవరిని తీసుకోవాలన్న విషయంలో చిత్రయూనిట్ కసరత్తులు చేస్తోంది. ముందుగా చరణ్‌కు జోడిగా రాశీఖన్నాను తీసుకోవాలని భావించారు. రాశీతో ఫోటో షూట్ కూడా నిర్వహించారన్న టాక్ వినిపించింది. తరువాత ఏం జరిగిందో ఏమో గాని మరోసారి హీరోయిన్ కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. తాజాగా మలయాళీ బ్యూటి అనుపమా పరమేశ్వరన్‌ను చరణ్‌కు జోడిగా ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది.

త్రివిక్రమ్ దర్శకత్వంలో నితిన్ హీరోగా తెరకెక్కిన 'అ..ఆ..' చిత్రంలో పల్లెటూరు గడుసరి అమ్మాయి పాత్రలో మంచి మార్కులు కొట్టేయడంతో .. చరణ్ సరసన ఓకే చేశారని తాజా సమాచారం. రాంచరణ్ ఈ సినిమాలో మూగ చెవిటి ఉన్న క్యారెక్టర్‌తో పాటు రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడంటూ వార్తలు వస్తున్నాయి. 2017లో ఫిబ్రవరి నాటికి ఈ సినిమా సినిమా షూటింగ్ ప్రారంభించి, జూలై నెలలో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారట చిత్ర యూనిట్. అయితే ఈ చిత్రానికి సంబంధించి మరో వారంలో అధికారికంగా క్లారిటీ రావొచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.