యాప్నగరం

Hemangi Kavi : లోపల అది వేసుకోలేదని నటిపై ట్రోలింగ్.. జబర్దస్త్ కౌంటర్ ఇచ్చిన అనుపమ!

హేమంగీ కవి విషయంలో అనుపమ స్పందిస్తూ.. అది కచ్చితంగా మా ఛాయిస్.. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు అని చెప్పుకొచ్చారు. మాకు నచ్చినట్టుగా ధరిస్తామనే ఉద్దేశ్యంలో అనుపమ కౌంటర్ వేశారు.

Samayam Telugu 25 Jul 2021, 3:31 pm

ప్రధానాంశాలు:

అది వేసుకోలేదంటూ ట్రోల్
గట్టిగా కౌంటర్ ఇచ్చిన హేమాంగి కవి
మద్దతిచ్చిన అనుపమ పరమేశ్వరణ్
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu లోపల అది వేసుకోలేదని నటిపై ట్రోలింగ్.. జబర్దస్త్ కౌంటర్ ఇచ్చిన అనుపమ!
Anupama Parameswaran
సోషల్ మీడియాలో ఎప్పుడు ఎలాంటి వివాదాలు చెలరేగుతాయో చెప్పడం కష్టం. ఎప్పుడు ఎవరిని నెటిజన్లు టార్గెట్ చేస్తారో చెప్పడం కష్టం. అలా గత వారంలో మరాఠీ నటి హేమంగీ కవికి వింత అనుభవం ఎదురైంది. తన ఇంట్లో తాను వంటగదిలో పని చేసుకుంటున్న వీడియోను షేర్ చేశారు. ఆ పని చూడటం, చపాతీలు చేసే విధానాన్ని చూడటం మానేసిన కొందరు ఆకతాయిలు తమ వక్రదృష్టికి పని చెప్పారు. బ్రా ధరించలేదా? అంటూ ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. అంతకు ముందు కూడా ఇలానే ఓ నటిని తన పర్సనల్ విషయాలపై కామెంట్ చేశారు.
HBD Kaikala Satyanarayana : మధురమైన అనుభూతి.. చిరు ఎమోషనల్
అయితే ఈ హేమంగీ కవి మాత్రం అలా తప్పుడు కూతలు కూసిన వారికి గట్టిగా కౌంటర్ వేసింది. అందరికీ ఉన్నట్టుగా నాకు కూడా ఉన్నాయి.. మనం కాళ్లు చేతులు పని చేస్తుంటే.. వాటికి తగ్గట్టు అవి కూడా అలానే కదులుతాయి.. ఇక ఇంట్లో ఉన్నప్పుడు ఏం ధరించాలో ధరించకూడదో అది నా ఇష్టం అంటూ ట్రోలింగ్ చేసే వారికి గట్టిగా పంచ్ ఇచ్చారు.

అయితే తాజాగా ఈ ఘటన మీద అనుపమా పరమేశ్వరణ్ స్పందించారు. ఇలా తన మీద కూడా అప్పుడప్పుడు ట్రోలింగ్ వస్తుంటుంది. ఆ మధ్య తన ఫోటోలను మార్పింగ్ చేయడంపైనా అనుపమ ఫైర్ అయ్యారు. అయితే హేమంగీ కవి విషయంలో అనుపమ స్పందిస్తూ.. అది కచ్చితంగా మా ఛాయిస్.. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు అని చెప్పుకొచ్చారు. మాకు నచ్చినట్టుగా ధరిస్తామనే ఉద్దేశ్యంలో అనుపమ కౌంటర్ వేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.