యాప్నగరం

అనుష్క తదుపరి సినిమా అదేనా?

సినిమాలు చాలా వరకూ తగ్గించేసినట్టుగా అగుపిస్తోంది అనుష్కా షెట్టి.

Samayam Telugu 17 Jul 2018, 3:21 pm
సినిమాలు చాలా వరకూ తగ్గించేసినట్టుగా అగుపిస్తోంది అనుష్కా షెట్టి. ‘బాహుబలి 2’, ‘బాగమతి’ సినిమాల తర్వాత అనుష్క సినిమా ఏదంటే చెప్పడం కష్టం అవుతోంది. ఇప్పటి వరకూ మరో సినిమా దేన్నీ ఒకే చేయలేదు ఈమె. ఒకవైపు అనుష్క త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందనే వార్తలు కూడా వస్తున్నాయి. కొత్తగా సినిమాలేవీ ఒప్పుకోకపోవడంతో ఈ తరహా వార్తలు వస్తున్నాయి.
Samayam Telugu 2


అయితే పెళ్లి విషయాన్ని అనుష్క అధికారికంగా ధ్రువీకరించడం లేదు. అదలా ఉంటే.. ఈ హీరోయిన్ ను తన సినిమాల్లో నటింపజేయడానికి ప్రయత్నిస్తున్నాడట దర్శకుడు చంద్రశేఖర్ యేలేటి. వెరైటీ సినిమాల రూపకర్త ఈ దర్శకుడు. అయితే కమర్షియల్ హిట్స్ ఇతడి ఖాతాలో తక్కువే. ఇప్పుడు మరో సినిమాతో వస్తున్నాడట. నాని ఆ సినిమాలో హీరోగా నటించబోతున్నట్టు సమాచారం.

ఆ సినిమాలో అనుష్కను నటింపజేయాలని ఈ దర్శకుడు ప్రయత్నాలు సాగిస్తున్నాడట. ప్రస్తుతం అనుష్క డిఫరెంట్ సినిమాలు చేస్తూ వస్తోంది. తనే ప్రధాన పాత్రల్లో నటించే సినిమాలకు కూడా ఓకే చెబుతోంది. ఈ క్రమంలో చంద్రశేఖర్ యేలేటి వంటి దర్శకుడి సినిమాలో నటించడానికి ఆమె ఓకే చెప్పే అవకాశాలున్నాయి. అన్ని కుదిరితే త్వరలోనే అధికారిక ప్రకటన రావొచ్చు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.