బాహుబలి బ్యూటీ.. టాలీవుడ్ స్వీటీ.. అనుష్క ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘భాగమతి’ మూవీ కొద్దిరోజుల క్రితమే సెట్స్‌పైకి వెళ్ళిన విషయం తెలిసిందే. యూవీ క్రియేషన్స్ నిర్మిస్తోన్న ఈ హిస్టారికల్ డ్రామాకు గ్రాఫిక్స్ వర్క్ జరుగుతోంది. బాహుబలి 2 మూవీతో ప్రపంచ వ్యాప్తంగా పాపులారిటీ సంపాదించిన అనుష్క అప్ కమింగ్ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. పైగా అనుష్క అరుంధతి, రుద్రమదేవి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో బ్లాక్ బస్టర్ హిట్లను ఖాతాలో వేసుకోవడంతో తిరిగి మహిళా ప్రాధాన్యత ఉన్న హిస్టారికల్ చిత్రంలో నటిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్‌ను ఛాలెంజ్‌గా తీసుకుని డీల్ చేస్తున్నాడు దర్శకుడు అశోక్.
‘పిల్ల జమీందార్’ చిత్రంతో టాలీవుడ్‌తో ప్రత్యేక ఇమేజ్ను సంపాదించిన అశోక్.. ‘భాగమతి’ మూవీని హై టెక్నికల్ వాల్యూస్ ఉపయోగించి భారీ గ్రాఫిక్స్‌తో తెరకెక్కిస్తున్నాడు. అయితే ఈ నయా మూవీ 'భాగమతి' వచ్చే సంక్రాంతికి విడుదల చేసేందుకు ప్లాన్ చేసినా.. అంతకంటే ముందుగానే థియేటర్లో సందడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రొడక్షన్ పనులు వేగవంతంగా జరుగుతుండటంతో అనుకున్న తేదీకి ముందుగానే ఈ మూవీ రిలీజ్ కానుంది. ఈ డిసెంబర్ చివర్లో అనుష్క ‘భాగమతి’ మూవీని భారీగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.
ఇదిలా ఉంటే ఈ డిసెంబర్లో ఇప్పటికే నాని ‘ఎంసీఏ’తో పాటు రాజ్ తరుణ్ ‘రాజుగాడు’ విడుదలకు ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకున్నాయి. కాగా అనుష్క భాగమతి కూడా రేస్‌లో చేరడంతో డిసెంబర్ నెలలో టాలీవుడ్లో సినీ సందడి మొదలవనుంది. ఇక 2019 జనవరిలో సంక్రాంతి కానుకగా.. పవన్ కళ్యాణ్-త్రివిక్రమ్ మూవీతో పాటు, రామ్ చరణ్ రంగస్థలం, బాలయ్య 102వ చిత్రాలు సంక్రాంతి రేస్‌లో నిలవనున్నాయి.