యాప్నగరం

అనుష్కకు కేరళాలో చికిత్స?

అనుష్క శెట్టికి ఏమైంది? భాగమతి తర్వాత ఆమె మరే చిత్రానికి ఒప్పుకోకపోవడానికి కారణం ఏమిటీ? ఆమె తమిళనాడు, కేరళాలో చికిత్సలు పొందడానికి కారణం ఏమిటి?

TNN 7 Dec 2017, 12:06 pm
అనుష్క శెట్టికి ఏమైంది? భాగమతి తర్వాత ఆమె మరే చిత్రానికి ఒప్పుకోకపోవడానికి కారణం ఏమిటీ? ఆమె తమిళనాడు, కేరళాలో చికిత్సలు పొందడానికి కారణం ఏమిటనే అనుమానాలు ఆమె అభిమానులను కలవరపరుస్తున్నాయి. ‘బాహుబలి’ సీరీస్ తర్వాత అనుష్క ‘భాగమతి’ సినిమా మాత్రమే చేసింది. అయితే, ఆమెకు వరుసగా అవకాశాలు వస్తున్నా ప్రస్తుతం ఏ చిత్రాలకు ఒప్పుకోవడం లేదు. ఇందుకు కారణం ఏమిటా అని ఆరా తీస్తే.. ఆమె కొయంబత్తూరు, కేరళాలో ప్రకృతి వైద్యం పొందుతున్నట్లు తెలిసింది.
Samayam Telugu anushka shetty in kerala for back pain treatment
అనుష్కకు కేరళాలో చికిత్స?


‘సైజ్ జీరో’ సినిమా కోసం బాగా లావైన అనుష్క.. మళ్లీ సన్నబడేందుకు చాలా ప్రయత్నాలు చేసింది. ఇందుకు ఆమె నిత్యం కసరత్తులు, డైట్ పాటిస్తూ.. మళ్లీ పూర్వ రూపానికి వచ్చింది. దీనివల్ల ఆమె ఇప్పుడు తీవ్రమైన నడుము నొప్పితో బాధపడుతున్నట్లు తెలిసింది. ఇందుకు కేరళాలో స్పా థెరపీతో పాటు వివిధ ప్రకృతి చికిత్సలను అందుకుంటున్నట్లు టాలీవుడ్ వర్గాలు తెలిపాయి.

అనుష్క పని విషయంలో చాలా ఖచ్చితంగా ఉంటుందని ఆమెతో పనిచేసిన దర్శక నిర్మాతలు, సహ నటులు చెబుతుంటారు. ఆమె ఫిట్‌నెస్ సమస్యలు తదుపరి సినిమాలపై ప్రభావం చూపకూడదనే ఉద్దేశంతో ఆమె పూర్తిగా కోలుకున్నాకే కొత్త సినిమాలను ఒప్పుకోవాలని నిర్ణయించినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని, త్వరలోనే కొత్త సినిమాలకు సైన్ చేయనున్నారని తెలిసింది. కాబట్టి.. అనుష్క త్వరగా కోలుకుని, మళ్లీ అలరించాలని కోరుకుందాం.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.