యాప్నగరం

అనుష్క ‘భాగమతి’ న్యూ ఇయర్ సర్‌ప్రైజ్!

ఈ పోస్టర్‌లో ఆసక్తికర విషయం ఏమిటంటే.. అందులో ‘భాగమతి’ అసలైన రూపానికి సంబంధించిన ఛాయచిత్రం కూడా కనిపిస్తోంది. అనుష్క నడుచుకుంటూ ఆ చిత్రాన్ని చూస్తున్నట్లుగా పోస్టర్లో ఉంది.

TNN 1 Jan 2018, 12:31 pm
‘భాగమతి’గా అనుష్క శెట్టి మరో కొత్త లుక్‌తో వచ్చింది. ఫస్ట్‌లుక్ భయానకంగా కనిపించిన అనుష్క కొత్త సంవత్సరం కానుకగా విడుదల చేసిన పోస్టర్‌లో చాలా సాద్వికంగా కనిపిస్తోంది. పిల్ల జమీందార్ ఫేం జి అశోక్ దర్శకత్వంలో రూపొందుతున్న 'భాగమతి' టీజర్ ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఎప్పటికప్పుడు సినిమాల మధ్య వ్యత్యాసం చూపించే అనుష్క ‘భాగమతి’లోనూ సరికొత్తగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. తాజా పోస్టర్‌లో ఆసక్తికర విషయం ఏమిటంటే.. అందులో ‘భాగమతి’ అసలైన రూపానికి సంబంధించిన ఛాయచిత్రం కూడా కనిపిస్తోంది. అనుష్క నడుచుకుంటూ ఆ చిత్రాన్ని చూస్తున్నట్లుగా పోస్టర్లో ఉంది.
Samayam Telugu anushka shetty new years surprise
అనుష్క ‘భాగమతి’ న్యూ ఇయర్ సర్‌ప్రైజ్!


థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్లో వంశీ ప్రమోద్ నిర్మిస్తున్నారు. ఆది పినిశెట్టి, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఒకే రోజు ఈ సినిమా విడుదల కానుంది. గతేడాది బాహుబలి-2 తప్ప మరే హిట్లూ అందుకోని అనుష్క ‘భాగమతి’తో హిట్ కొడుతుందో లేదో చూడాలి.


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.