యాప్నగరం

తన ఉద్యోగులపై అనుష్క కఠిన నిర్ణయం

‘స్వీటీ’ అనే పేరుకు తగ్గట్లుగా అనుష్క మనసు కూడా చాలా స్వీట్ అని చెబుతుంటారు.

TNN 1 May 2017, 2:38 pm
‘స్వీటీ’ అనే పేరుకు తగ్గట్లుగా అనుష్క మనసు కూడా చాలా స్వీట్ అని చెబుతుంటారు. ఎవరినీ వేరు చేసి చూడకుండా అందరితో గౌరవంగా ప్రవర్తించే అనుష్క ఇప్పుడు ఓ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఇంతకీ స్వీటీ తీసుకున్న ఆ నిర్ణయం ఏంటో తెలుసా..? తన పర్సనల్ స్టాఫ్ మొత్తాన్ని ఒకేసారి పీకి పడేసి ఇప్పుడు కొత్త స్టాఫ్‌ను నియమించుకునే పనిలో పడిందట. అంతేకాదు ఉద్యోగంలో నుంచి వాళ్లను తొలగించే ముందు సదరు స్టాఫ్‌కు ఓ రేంజ్‌లో చీవాట్లు కూడా పెట్టిందని చెబుతున్నారు.
Samayam Telugu anushka shetty removes her personal staff
తన ఉద్యోగులపై అనుష్క కఠిన నిర్ణయం


అంతటి అపరాధం వాళ్లు ఏం చేశారో గానీ స్వీటీని మాత్రం బాగా బాధపెట్టినట్లు తెలుస్తోంది. లేకపోతే ఆమెకు అంత కోపం ఎందుకు వస్తుంది..? ఉన్నపళంగా ఉద్యోగాల్లో నుంచి ఎందుకు తొలగిస్తుంది..? అంటూ చర్చించుకుంటున్నారు. ఇలా పాత స్టాఫ్‌ను తీసేసి కొత్తవారిని నియమించుకోవడం మన తారలకు కొత్తేమీ కాదు. గతంలో చాలా మంది ఇలానే చేశారు. ప్రస్తుతం స్వీటీ ‘బాహుబలి 2’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తోంది. మరికొన్ని రోజుల్లో తన కొత్త సినిమాల షూటింగ్స్‌లో పాల్గొనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.