యాప్నగరం

జగన్ నా వీరాభిమాని.. కడప టౌన్ ప్రెసిడెంట్: బాలకృష్ణ

ఆంధ్రప్రదేశ్ సీఎం వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి తనకు వీరాభిమాని అని నందమూరి బాలకృష్ణ అన్నారు. కడప టౌన్ ప్రెసిడెంట్ అని చెప్పారు. దీంతో గతంలో వచ్చిన వార్తలను బాలయ్య ఖరారు చేసినట్లయింది.

Samayam Telugu 7 Jun 2020, 3:53 pm
నటసింహా నందమూరి బాలకృష్ణకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి వీరాభిమాని అని, అప్పట్లో బాలయ్య అభిమాన సంఘానికి ఆయన అధ్యక్షుడిగా కూడా పనిచేశారని కిందటేడాది జూన్‌లో ఒక పేపర్ కటింగ్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యింది. వై.యస్.జగన్మోహన్ రెడ్డి, ప్రెసిడెంట్, కడప జిల్లా బాలయ్య అభిమాన సంఘం పేరిట ‘సమరసింహారెడ్డి’ పోస్టర్‌తో నూతన సంవత్సర శుభాకాంక్షలు (2000) తెలుపుతూ పేపర్‌లో వచ్చిన ప్రకటనను బాలకృష్ణ అభిమానులు బాగా వైరల్ చేశారు. అయితే, ఇది ఫేక్ అని అప్పట్లో చాలా మంది ఖండించారు.
Samayam Telugu బాలకృష్ణ, జగన్
Balakrishna


Also Read: హర్భజన్ సింగ్ ‘ఫ్రెండ్‌షిప్’ ఫ‌స్ట్‌లుక్.. సచిన్ రెస్పాన్స్ అదిరింది!

2003లో వై.ఎస్. జగన్ తీసుకున్న ఫొటోను మార్ఫింగ్ చేసి ఈ పేపర్ కటింగ్‌ను సృష్టించారని జగన్ అభిమానులు ఆరోపించారు. కానీ, ఇది నిజమేనని స్వయంగా నందమూరి బాలకృష్ణ అన్నారు. ఆయన తాజాగా ఓ వార్తా పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ప్రస్తావించారు. వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి తన వీరాభిమాని అని, కడప అభిమాన సంఘం టౌన్ ప్రెసిడెంట్ అని చెప్పారు. అయితే, రాజకీయాలు వేరు.. సినిమాలు వేరు అని బాలయ్య అన్నారు. దీనికి తన తండ్రిని ఉదాహరణగా చెప్పారు.

Also Read: రాహుల్ విజ‌య్ హీరోగా కొత్త సినిమా.. ఇదైనా కలిసొస్తుందా!

ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చినప్పుడు అప్పట్లో పెద్ద పార్టీ అయిన కాంగ్రెస్‌లో 90 శాతం మంది ఆయన అభిమానులేనని గుర్తుచేశారు. కాగా, జగన్ తన వీరాభిమాని అని స్వయంగా బాలకృష్ణ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆయన అభిమానులు ఈ మాటలను సోషల్ మీడియాలో విపరీతంగా షేర్ చేస్తున్నారు. మరి బాలయ్య వ్యాఖ్యలకు జగన్ అభిమానులు, వైఎస్సార్‌సీపీ నాయకులు ఎలా స్పందిస్తారో చూడాలి. మరోవైపు, జూన్ 10న బాలకృష్ణ 60వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించడానికి అభిమానులు ప్లాన్ చేస్తున్నారు. ఎవరి ఇళ్లలో వారే ఉంటూ కేక్ కట్‌చేసి గిన్నిస్ రికార్డు నెలకొల్పాలని చూస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.