యాప్నగరం

Aravinda Sametha Collections Day 1: యూఎస్‌లో ‘అరవింద సమేత’ రికార్డ్ వసూళ్లు

యూఎస్‌లో ఒక మిలియన్ డాలర్ల మార్కును దాటిని ఎన్టీఆర్ ఆరో చిత్రమిది. వరసగా ఐదో సినిమా. అంతేకాకుండా ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఎన్టీఆర్ చిత్రంగానూ ‘అరవింద సమేత’ నిలవబోతోంది.

Samayam Telugu 12 Oct 2018, 11:06 am
Samayam Telugu NTR
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘అరవింద సమేత వీర రాఘవ’ బాక్సాఫీసు వద్ద రికార్డు కలెక్షన్లు రాబడుతోంది. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన ఈ భారీ యాక్షన్ చిత్రం తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్‌ను సొంతం చేసుకుంది. వాస్తవానికి విడుదలకు ముందు నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అందుకే రెండు తెలుగు రాష్ట్రాల్లో తొలిరోజు టికెట్లన్నీ రెండు రోజుల ముందుగానే అమ్ముడుపోయాయి. ‘అరవింద సమేత’కు తొలిరోజు కలెక్షన్లు కచ్చితంగా అదిరిపోతాయాని ముందుగానే ఊహించారు. అయితే అనుకున్నదాని కంటే భారీగా ఈ సినిమా వసూళ్లు రాబడుతోంది.

కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్, ఆస్ట్రేలియాలోనూ మంచి వసూళ్లను రాబట్టింది. యూఎస్‌లో గురువారం ప్రివ్యూల ద్వారా 791,021 డాలర్లు (సుమారు రూ.5.85 కోట్లు) వసూలైంది. యూఎస్‌లో మొత్తం 218 లొకేషన్లలో ప్రదర్శితమవుతోన్న ‘అరవింద సమేత’.. ఇప్పటికే ఒక మిలియన్ డాలర్ల (సుమారు రూ.7.36 కోట్లు) మార్క్‌ను దాటేసింది. యూఎస్‌లో ఒక మిలియన్ డాలర్ల మార్కును దాటిని ఎన్టీఆర్ ఆరో చిత్రమిది. వరసగా ఐదో సినిమా. అంతేకాకుండా ఓవర్సీస్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన ఎన్టీఆర్ చిత్రంగానూ ‘అరవింద సమేత’ నిలవబోతోంది. శుక్రవారం షోలు పూర్తయ్యే సరికి 2 మిలియన్ డాలర్ల వసూళ్లు ఖాయం అంటున్నారు.
ఆస్ట్రేలియా బాక్సాఫీసు వద్ద ‘అరవింద సమేత’ తొలిరోజు 128,740 ఆస్ట్రేలియన్ డాలర్లు (రూ.67.63 లక్షలు) వసూలు చేసినట్లు మూవీ ఎనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ట్వీట్ చేశారు. ఆస్ట్రేలియాలో మొత్తం 35 లొకేషన్లలో ‘అరవింద సమేత’ ప్రదర్శితమవుతోంది. ఆస్ట్రేలియాలో అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రాల జాబితాలో ‘అరవింద సమేత’ 9వ స్థానంలో నిలిచిందన్నారు. ఇదిలా ఉంటే, నైజాంలో తొలిరోజు ‘అరవింద సమేత’ రూ.8.30 కోట్లు వసూలు చేసింది. దీనిలో షేర్ రూ.5.73 కోట్లు. ఈ విషయాన్ని సినీ విశ్లేషకుడు రమేష్ బాల ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. 2018లో నైజాంలో అత్యధిక గ్రాస్ వసూలు చేసిన రెండో చిత్రమిది (నాన్ బాహుబలి ఫిల్మ్). గతంలో ‘అజ్ఞాతవాసి’ అత్యధికంగా రూ.8.13 కోట్లు రాబట్టింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.