యాప్నగరం

అన్నపూర్ణమ్మ గారి మనవడితో అర్చన హంగామా.. చిన్న సినిమా పెద్ద అడుగు! ఇదీ మేకర్స్ ప్లాన్..

బాలాదిత్య, అర్చన హీరోహీరోయిన్లుగా రూపొందిన 'అన్నపూర్ణమ్మ గారి మనవడు' చిత్రాన్ని ముందుగా ఓవర్సీస్‌లో విడుదల చేయబోతున్నారు. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషలలో ఒకేసారి ఓ చిన్న చిత్రం ఓవర్సీస్‌లో విడుదల కానుండటం ఇదే మొదటిసారి.

Samayam Telugu 23 Oct 2020, 6:32 pm
తెలుగు, తమిళ సినీరంగాలకు చెందిన ప్రముఖ నటీనటులతో పాటు మహానటి జమున నటించిన చిత్రం 'అన్నపూర్ణమ్మ గారి మనవడు'. సీనియర్ నటి అన్నపూర్ణమ్మ నాయనమ్మగా మాస్టర్ రవితేజ మనవడిగా టైటిల్ పాత్రలు పోషించారు. హీరో హీరోయిన్లుగా బాలాదిత్య, అర్చన నటించారు. ఎంఎన్ఆర్ ఫిలిమ్స్ పతాకంపై జాతీయ అవార్డు గ్రహీత నర్రా శివనాగేశ్వర రావు (శివనాగు) దర్శకత్వంలో ఎంఎన్ఆర్ చౌదరి ఈ చిత్రాన్ని నిర్మించారు.
Samayam Telugu అన్నపూర్ణమ్మ గారి మనవడితో అర్చన హంగామా
Archana


కరోనా కారణంగా థియేటర్స్ మూతపడటంతో విడుదల ఆలస్యమైంది. దీంతో ఇప్పుడీ చిత్రాన్ని ముందుగా ఓవర్సీస్‌లో విడుదల చేయబోతున్నారు మేకర్స్. శుక్రవారం హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో చిత్ర దర్శకుడు నర్రా శివ నాగేశ్వర రావు ఈ విషయాన్ని తెలిపారు. యూఎస్‌తో పాటు ఓవర్సీస్‌లో ఈ నెల 25న ఈ చిత్రాన్ని నాలుగు భాషలలో అమేజాన్ ప్రైమ్‌లో విడుదల చేయబోతున్నామని అన్నారు.

Also Read: Vakeel Saab: రెడీ అనేసిన వకీల్‌ సాబ్.. పండగ పూట పవన్ కళ్యాణ్ రచ్చ! మెగా ఫ్యాన్స్ ఊగిపోవాల్సిందే!

తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషలలో ఒకేసారి ఓ చిన్న చిత్రం ఓవర్సీస్‌లో విడుదల కానుండటం ఇదే మొదటిసారి. థియేటర్స్ ఓపెన్ కాగానే ఇండియాలో నాలుగు భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని దర్శకుడు నర్రా శివ నాగేశ్వరరావు చెప్పారు. కళాతపస్వి కె.విశ్వనాధ్ ఈ చిత్రాన్ని చూసి దర్శకుడిగా నన్ను ప్రశంసించడం మరచిపోలేని విషయమని అన్నారు. అమరావతి, అన్నవరం, అమలాపురం తదితర ప్రాంతాలలోని కనువిందు చేసే పచ్చని లొకేషన్లలో ప్రేమానురాగాలకు నిలయమైన స్వచ్ఛమైన పల్లెటూరి కథతో ఉమ్మడి కుటుంబాలలో వున్న అనుబంధాలను, మానవ సంబంధాలను సమ్మిళతం చేసి తెరకెక్కించిన చిత్రమిదని తెలిపారు.

ఇదే వేదికపై చిత్రంలోని నాలుగు పాటలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో అమేజాన్ ప్రతినిధి రాజీవ్ కూడా పాల్గొన్నారు. శ్రీలక్ష్మి, ప్రభ, జయంతి, సుధ, సంగీత, జయవాణి, బెనర్జీ, రఘుబాబు, అదుర్స్ రఘు, తాగుబోతు రమేష్, సుమన్ శెట్టి, జీవాలతో పాటు పలువురు తమిళ, మలయాళ నటీనటులు ఈ చిత్రంలో నటించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.