యాప్నగరం

టీజర్: కొహ్లీ భార్య భయపెట్టేసింది

బాలీవుడ్ అనుష్క కూడా ఇప్పుడు ఒక హారర్ సబ్జెక్ట్ తోనే వచ్చింది.

TNN 7 Feb 2018, 2:53 pm
ఒకవైపు ‘భాగమతి’తో సౌతిండియన్ అనుష్క తెలుగు ప్రేక్షకులను భయపెట్టేసి డబ్బులు వసూలు చేసుకుంటోంది. అనుష్క షెట్టి ప్రధాన పాత్రలో వచ్చిన ఈ సినిమా ముప్పై కోట్ల రూపాయల వసూళ్ల మార్కును దాటేసింది. తద్వారా 2018లో తొలి హిట్టును సాధించింది.
Samayam Telugu are you ready to get sleepless nights
టీజర్: కొహ్లీ భార్య భయపెట్టేసింది


ఇక బాలీవుడ్ అనుష్క కూడా ఇప్పుడు ఒక హారర్ సబ్జెక్ట్ తోనే వచ్చింది. తాజాగా విడుదల అయిన ఆమె సినిమా ‘పరి’ టీజర్ ఆసక్తిదాయకంగా ఉంది. పక్కా హారర్ ఎంటర్ టైనర్ గా రూపొందింది ఈ సినిమా. 52 సెకన్ల టీజర్ తో అనుష్కా శర్మ హడలుగొట్టింది. అటు దెయ్యంగా తనే, భయపడుతూ కూడా తనే కనిపిస్తూ టీజర్ తో కట్టిపడేసింది అనుష్క.

‘బీ సేఫ్’ హెచ్చరికతో హోలీ సందర్భంగా మార్చి రెండో తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది. ఇప్పటికే ‘#PariTeaser’ ఇంటర్నెట్ లో ట్రెండింగ్ గా మారింది.


వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.