యాప్నగరం

జాన్వీని తిడితే ఊరుకోను: అర్జున్ కపూర్ ఫ్యాన్‌పై ఫైర్

శ్రీదేవి కూతుళ్లను ఉద్దేశించి నెగటివ్ కామెంట్లు చేసిన అర్జున్ కపూర్ అభిమానికి ఆయన సోదరి అన్షులా కపూర్ సుతి మెత్తటి వార్నింగ్ ఇచ్చారు.

TNN 5 Mar 2018, 1:47 pm
శ్రీదేవి హఠాన్మరణంతో దేశవ్యాప్తంగా అభిమానులు షాకయ్యారు. ఆమె కూతుళ్లు జాన్వీ, ఖుషీలైతే.. తల్లి మరణాన్ని తట్టుకోలేకపోతున్నారు. బోనీకపూర్ మొదటి భార్య కుమారుడు అర్జున్ కపూర్ జాన్వీకి అండగా నిలిచాడు. పంజాబ్‌లో షూటింగ్‌లో ఉన్న అతడు శ్రీదేవి మరణ వార్త తెలియగానే ముంబై చేరుకున్నాడు. శ్రీదేవితో సరైన సంబంధాలు లేనప్పటికీ.. ఇండియాలో ఒంటరిగా ఉన్న జాన్వీ దగ్గరికెళ్లి ఓదార్చాడు. పార్థీవ దేహాన్ని తరలించడంలో ఆలస్యం తలెత్తడంతో.. దుబాయ్‌ వెళ్లి తండ్రికి అండగా నిలిచాడు.
Samayam Telugu arjun kapoor fan abused sridevi daughters janhvi and khushi anshula kapoor slammed him
జాన్వీని తిడితే ఊరుకోను: అర్జున్ కపూర్ ఫ్యాన్‌పై ఫైర్


అర్జున్ కపూర్ సోదరి అన్షులా కపూర్ కూడా తన చెల్లెల్లకు బాసటగా నిలిచింది. కష్టాల్లో ఉన్న కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చేలా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసింది. చాలా మంది నెటిజన్లు ఆమె పోస్ట్‌ పట్ల సానుకూలగా స్పందించారు. కానీ అర్జున్ కపూర్ అభిమాని ఒకరు మాత్రం జాన్వీ, ఖుషీలను దూషిస్తూ నెగటివ్‌గా కామెంట్ పెట్టారు.


వెంటనే ఆ కామెంట్‌ను డిలీట్ చేసిన అన్షులా.. మా చెల్లెల్లను దూషిస్తే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చింది. అన్న పట్ల, నా పట్ల మీ అభిమానానికి ధన్యవాదాలంటూనే.. జాన్వీ పట్ల ఇలాంటి దూషణలకు దిగొద్దని సుతిమెత్తగా హెచ్చరించింది. మంచిని పంచండి, సానుకూలంగా ఉండండని ఆమె సూచించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.