యాప్నగరం

తమిళ ‘అర్జున్ రెడ్డి’ ఆ హీరోనేనా..?

తెలుగులో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమా తమిళ రీమేక్ విషయంలో ప్రధానంగా ఇద్దరు హీరోల పేర్లు వినిపిస్తున్నాయి.

TNN 19 Sep 2017, 2:19 pm
తెలుగులో సూపర్ హిట్ అయిన అర్జున్ రెడ్డి సినిమా తమిళ రీమేక్ విషయంలో ప్రధానంగా ఇద్దరు హీరోల పేర్లు వినిపిస్తున్నాయి. వారిద్దరూ కూడా ‘అర్జున్ రెడ్డి’ పాత్రను చేయడానికి ఉత్సాహంతో ఉన్నారని సమాచారం. మరి ఆ హీరోలు ఎవరంటే.. ఒకరు ధనుష్, మరొకరు ఆర్య. తెలుగువారికి సుపరిచితులు అయిన ఈ హీరోలిద్దరూ ఈ తెలుగు సినిమా రీమేక్ పట్ల ఆసక్తితో ఉన్నట్టుగా తెలుస్తోంది. కోలీవుడ్ సమాచారం ప్రకారం.. అర్జున్ రెడ్డి తమిళ వెర్షన్ కు హీరోగా ఆర్య ఖరారు అయినట్టే అని సమాచారం.
Samayam Telugu arjunreddy remake on cardsarya as hero
తమిళ ‘అర్జున్ రెడ్డి’ ఆ హీరోనేనా..?


ఈ సినిమా తమిళ, మలయాళ రీమేక్ హక్కులను E4 ఎంటర్టైన్ మెంట్స్ సంస్థ సొంతం చేసుకుందని తెలుస్తోంది. తమిళ డబ్బింగ్, రీమేక్ హక్కుల కోసం పలువురు మూవీ మేకర్లు పోటీ పడగా.. చివరకు ఆ హక్కులు ఈ సంస్థకు దక్కాయని తెలుస్తోంది. ఇక హీరో విషయానికి వస్తే.. ఈ విషయంలోనూ పోటీ కనిపిస్తోంది. ఈ పాత్రను చేయడానికి శింబు ఆసక్తితో ఉన్నాడట. కానీ.. అతడికి వేర్వేరు కమిట్ మెంట్స్ తో డేట్స్ అడ్జస్ట్ అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్యకు ఈ పాత్ర దక్కే అవకాశం ఉందని, అతడు హీరోగా ఈ సినిమా తెరకెక్కే అవకాశం ఉందని తెలుస్తోంది.

ఇదే నిర్మాణ సంస్థ అర్జున్ రెడ్డి సినిమాను మలయాళంలో కూడా రీమేక్ చేయనుందని సమాచారం. తమిళ వెర్షన్ నే మలయాళంలోకి డబ్ చేయడం లేదా, అక్కడ మరో హీరోతో రీమేక్ చేయనున్నారని తెలుస్తోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.