యాప్నగరం

ఓరుగల్లు పిల్లతోటే అర్జున్ రెడ్డి పెళ్లట!

‘అర్జున్ రెడ్డి’ సినిమాతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించి టాలీవుడ్ క్రేజీ స్టార్‌గా మారిన విజయ్ దేవరకొండ తన పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చాడు.

TNN 13 Jan 2018, 5:19 pm
‘అర్జున్ రెడ్డి’ సినిమాతో యూత్‌లో మంచి ఫాలోయింగ్ సంపాదించి టాలీవుడ్ క్రేజీ స్టార్‌గా మారిన విజయ్ దేవరకొండ తన పెళ్లి విషయంపై క్లారిటీ ఇచ్చాడు. తాను పెళ్లాడబోయే పిల్ల ఎవరో చెప్పలేదు కాని ఏ ప్రాంతానికి చెందిన అమ్మాయిని పెళ్లాడబోతున్నాడో చెప్పాడు. వరంగల్‌లోని హన్మకొండలో ఓ జ్యూయలర్‌ షాపు ప్రారంభోత్సవంలో పాల్గొన్న విజయ్ దేవరకొండ తాను పెళ్లి చేసుకుంటే ఖచ్చితంగా వరంగల్ అమ్మాయినే చేసుకుంటానని తన మనసులో కోరికలను బయటపెట్టాడు. తన అన్నయ్య వరంగల్‌ అమ్మాయినే పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలతో సంతోషంగా ఉన్నాడని.. తాను కూడా ఓరుగల్లు అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని తేల్చిచెప్పేశాడు.
Samayam Telugu arjunreddy to launch malabar gold and diamonds at warangal
ఓరుగల్లు పిల్లతోటే అర్జున్ రెడ్డి పెళ్లట!


ఈ సందర్భంగా తనను చూడటానికి వచ్చిన అభిమానులతో సెల్ఫీలను దిగుతూ, అర్జున్ రెడ్డి సినిమా డైలాగ్‌లతో అలరించాడు విజయ్. అనంతరం స్థానిక ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్‌రావు ఇంటికి వెళ్లి వారి కుటుంబసభ్యులతో సరదాగా గడిపారు. కాగా.. విజయ్ దేవరకొండ ప్రస్తుతం గీతాఆర్ట్స్ బ్యానర్‌లో ఓ ప్రేమకథా చిత్రంలో నటిస్తున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.