యాప్నగరం

చిన్నా విషయంలో సిట్ విచారణ తీరు మారిందా ?

ఇప్పటివరకు విచారణ ఎదుర్కున్న వారిలో తరుణ్, నవదీప్ మినహాయించి మిగతా వారంతా డ్రగ్స్ వినియోగంలో...

TNN 25 Jul 2017, 3:05 pm
సంచలనం సృష్టించిన డ్రగ్స్ రాకెట్ కేసులో ఆరో రోజు ఆర్ట్ డైరెక్టర్ చిన్నా విచారణ ముగిసింది. ఉదయం 10:30 గంటలకి ప్రారంభమైన ఈ విచారణ నాలుగు గంటలపాటు కొనసాగింది. ఇప్పటివరకు విచారణ ఎదుర్కున్న వారిలో ఇలా కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే విచారణ ముగించుకుని బయటికొచ్చింది చిన్నా ఒక్కరే. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కే నాయుడు సైతం సిట్ అధికారుల నుంచి ఐదున్నర గంటలపాటు విచారణ ఎదుర్కున్నారు.
Samayam Telugu art director chinnas investigation is over in drugs racket probe
చిన్నా విషయంలో సిట్ విచారణ తీరు మారిందా ?


ఇప్పటివరకు విచారణ ఎదుర్కున్న వారిలో తరుణ్, నవదీప్ మినహాయించి మిగతా వారంతా డ్రగ్స్ వినియోగంలో పూరి జగన్నాథ్‌తో సంబంధాలు కలిగి వున్నారనే ఆరోపణలు ఎదుర్కుంటున్న వారే. ఆర్ట్ డైరెక్టర్ చిన్నా సైతం పూరితో కలిసి పనిచేయడంతో ఆయనని కూడా అధిక సమయంపాటు విచారించే అవకాశాలున్నాయని భావించారు. కానీ ఊహించని రీతిలో తొలిసారిగా లంచ్ సెషన్‌లోపే చిన్నా విచారణ ముగించారు సిట్ అధికారులు. దీంతో టాలీవుడ్ ప్రముఖుల నుంచి అనేక ఆరోపణలు ఎదుర్కుంటున్న సిట్ సైతం తన విచారణ తీరు మార్చుకుందా అనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. లేదంటే ఇది వారి కొత్త స్ట్రాటెజీ అయినా కావచ్చనే టాక్ కూడా వినిపిస్తోంది.

ఇదిలావుంటే, ఇదే సిట్ విచారణపై పలు అభ్యంతరాలు చేస్తూ ప్రముఖ సినీ నటి చార్మీ హై కోర్టుకి వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఇంకొద్ది సేపట్లో హై కోర్టు తీర్పు వెల్లడించనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.