యాప్నగరం

‘మెర్సల్’ దర్శకుడు రెడీ: హీరో మహేశా.. బన్నీనా?

అట్లీ.. ఈ మధ్య కాలంలో తమిళంలో బాగా పాపులర్ అయిన డైరెక్టర్.

TNN 26 Oct 2017, 3:46 pm
అట్లీ.. ఈ మధ్య కాలంలో తమిళంలో బాగా పాపులర్ అయిన డైరెక్టర్. ఎ.ఆర్.మురుగుదాస్ నిర్మించిన ‘రాజా రాణి’ చిత్రంతో దర్శకుడిగా పరిచయమైన అట్లీ.. తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ సినిమా తెలుగు ప్రజలు కూడా ఆదరించారు. ఆ తరవాత విజయ్ హీరోగా ‘థెరి’ తెరకెక్కించాడు. ఇది కూడా కమర్షియల్ మంచి విజయం సాధించింది. ఈ సినిమా ‘పోలీసోడు’ పేరుతో తెలుగులో అనువాదమైంది. తాజాగా అట్లీ దర్శకత్వం వహించిన ‘మెర్సల్’ మూవీ బాక్సాఫీసు వద్ద ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ సినిమా ‘అదిరింది’ పేరుతో శుక్రవారం తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Samayam Telugu atlee may direct either mahesh babu or allu arjun
‘మెర్సల్’ దర్శకుడు రెడీ: హీరో మహేశా.. బన్నీనా?


అయితే ‘మెర్సల్’ సినిమా వివాదాల్లోకి ఎక్కడంతో తమిళనాడుతో పాటు దక్షిణ భారతం వ్యాప్తంగా అట్లీ పేరు బాగా పాపులర్ అయిపోయింది. దీంతో ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్ టాలీవుడ్‌పై కన్నేశాడు. మాస్ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను థియేటర్‌కు రప్పించగల సత్తా అట్లీకి ఉంది. ఎమోషన్స్‌ను తెరపై పండించడంలో ఆయనది ప్రత్యేక శైలి. తెలుగు ప్రేక్షకులకు కావాల్సింది కూడా ఇదే. మంచి కమర్షియల్ హంగులతో పాటు భావోద్వేగాలను సినిమాలో బాగా చూపించగలిగితే తెలుగు ప్రేక్షకులు ఆదరిస్తారు. అందుకనే ఇప్పుడు ఈ అరవ దర్శకుడు తెలుగులో స్ట్రెయిట్ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.

గతంలో ఆయన మహేష్, ప్రభాస్ వంటి హీరోలతో కలిసి పనిచేసే ఛాన్స్ ఉందని వార్తలు వినిపించాయి. కానీ అవేవీ పట్టాలెక్కలేదు. అయితే తాజాగా ఈ దర్శకుడు తనకు తెలుగు సినిమా చేయాలనుందని వెల్లడించాడు. చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, బన్నీ, ఎన్టీఆర్‌లు అంటే తనకు ఇష్టమని చెప్పాడు. ఇప్పటికే మహేష్, బన్నీలతో కథా చర్చలు జరిపానని అన్నాడు. మరి ఆ ఇద్దరిలో ఈ డైరెక్టర్‌కు ఏ ఛాన్స్ ఇచ్చేది ఎవరో చూడాలి!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.