యాప్నగరం

పనిచేయని ATMలో ప్రేమజంట?

పెద్దనోట్లరద్దు కాన్సెప్ట్‌తో తెరకెక్కిన పొలిటికల్ సెటైర్ ప్రేమకథ చిత్రం ‘ ఏటిఎం నాట్ వర్కింగ్’ .

TNN 7 Feb 2017, 9:40 pm
పెద్దనోట్లరద్దు నేపధ్యంలో తెరకెక్కిన పొలిటికల్ సెటైర్ ప్రేమకథ చిత్రం ‘ ఏటిఎం నాట్ వర్కింగ్’ షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీ అవుతోంది. 2016 నవంబర్ 8 నుండి డిసెంబర్ 31 వరకు నోట్లరద్దు వల్ల జరిగిన సంఘటనలతో అల్లిన ఈ కధని డిజిక్వెస్ట్ ఇండియా లిమిటెడ్ మరియు శ్రావ్య ఫిలింస్ బ్యానర్ల సమర్పణలో కిషోర్ బసిరెడ్డి, యక్కలి రవీంద్రబాబు నిర్మించారు, సునీల్ కుమార్ రెడ్డి దర్శకుడు.
Samayam Telugu atm not working movie working stills
పనిచేయని ATMలో ప్రేమజంట?


అనంత్(A), త్రిలోక్(T), మహేష్(M) అనే ముగ్గురు పనీ పాట లేని కుర్రాళ్ళ జీవితంలో డిమాని టైజేషన్ సృష్టించిన సునామీ, ఎటిఎం క్యు లైన్ లో పుట్టన ప్రేమ, దాని పర్యవసానాలే ఈ సినిమా ప్రధాన ఇతివృత్తం.

దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ... స్వతంత్ర భారత దేశంలోని ప్రతి వ్యక్తిని ఏదో ఒక విధంగా ప్రభావితంచేసిన నిర్ణయం డిమానిటైజేషన్. ఈ నిర్ణయం నేపథ్యంలో ఒక జాతి జాతి 50 రోజులు క్యూలైన్ లో గడిపేసింది. రాజకీయాలు, ఆర్ధికనిపుణులు, సామాన్యులు పండితులు, పామరులుఅందరూచర్చించిన విషయానికి ఒక క్యారికేచర్లాంటిది ఈ చిత్రం.125 కోట్ల మందిని ప్రభావితంచేసిన ఈ నిర్ణయం సృష్టించిన అరుదైన సంఘటలను ఈ చిత్రంలో చూపించాం అని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.