యాప్నగరం

తనకి కుడి కన్ను కనిపించదని చెప్పిన రానా దగ్గుబాటి

బాహుబలి చిత్రంలో భళ్లాలదేవ పాత్ర పోషించిన రానా దగ్గుబాటి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ప్రస్తుత...

misskyra.com 1 May 2017, 3:38 pm
రానా దగ్గుబాటి నెగటివ్ పాత్రలో నటించిన బాహుబలి 2 రికార్డులు తిరగరాస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. హీరోగా లీడ్ క్యారెక్టర్స్ చేస్తున్న సమయంలోనే వచ్చిన ఈ నెగటివ్ పాత్ర ఆఫర్‌ని అనుమానం లేకుండా అందిపుచ్చుకున్నారు రానా. భళ్లాలదేవ పాత్రలో రానా పర్‌ఫార్మెన్స్ చూశాకా... అమరేంద్ర బాహుబలికి సమఉజ్జీగా ఆ పాత్రను పోషించడంలో రానా కాకుండా ఇంకెవ్వరైనా అంతగా సూట్ కాలేరేమో అని అనుకునేలా జీవించారు రానా.
Samayam Telugu baahubali 2 actor rana daggubati says he is blind from his right eye
తనకి కుడి కన్ను కనిపించదని చెప్పిన రానా దగ్గుబాటి


బాహుబలి చిత్రంలో భళ్లాలదేవ పాత్ర పోషించిన రానా దగ్గుబాటి విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్న ప్రస్తుత తరుణంలో అతడికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన కథనం ఆన్‌లైన్‌లో వైరల్ అవుతోంది. రానా దగ్గుబాటి ఆత్మస్థైర్యాన్ని, అతడిలోని పాజిటివ్ దృక్పథాన్ని చాటిచెప్పి, నలుగురికి ఆదర్శంగా నిలిచే కథనం అది.

గతంలో ఓ టీవీ ఛానెల్ నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న రానా దగ్గుబాటి, ఆ కార్యక్రమంలో మాట్లాడుతూ.. 'తనకి కుడి కన్ను కనిపించదు' అని వెల్లడించారు. స్టార్ స్టేటస్ వున్న ఓ నటుడు తన గురించి ఏ దాపరికాలు లేకుండా చెప్పడం ఆడియెన్స్‌ని కట్టిపడేసింది. అప్పటివరకు బయటి ప్రపంచానికి తెలియని ఈ విషయాన్ని రానా ఎంతో సింపుల్‌గా చెప్పడం చూసి ఆడియెన్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. రానాకి వున్న సింప్లిసిటీ ఏంటో ప్రపంచానికి పరిచయం చేశాయి ఆ కార్యక్రమంలో అతడు చేసిన వ్యాఖ్యలు.

ఆర్థికంగా ఇబ్బందుల్లో వున్న వారికి ఆపన్నహస్తం అందించే లక్ష్యంతో ఓ తెలుగు టీవీ ఛానెల్ గతంలో నేను సైతం అనే కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న రానా దగ్గుబాటి.. బాధితులకి బాసటగా నిలవడమేకాకుండా వారిలో మనోధైర్యాన్ని నింపేందుకు తీవ్రంగా కృషిచేసిన సందర్భంలో నాకు కుడి కన్ను కనిపించదని... అయినా నేను ఎంత ధైర్యంతో వున్నానో మీరు కూడా అంతే ధైర్యంగా వుండాలంటూ ఆ కార్యక్రమంలో పాల్గొన్న వారికి సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.