యాప్నగరం

'చైనాలో బాహుబలి 2' పుకార్లపై స్పందించిన నిర్మాత

చైనాలో బాహుబలి 2 సినిమా రిలీజ్ డేట్ ఖరారైందని.. ఇక రేపోమాపో అక్కడ ఈ బొమ్మ పడిపోవడం ఖాయమని..

TNN 3 Jun 2017, 6:49 pm
చైనాలో బాహుబలి 2 సినిమా రిలీజ్ డేట్ ఖరారైందని.. ఇక రేపోమాపో అక్కడ ఈ బొమ్మ పడిపోవడం ఖాయమని వస్తున్న వార్తలపై ఆ సినిమా నిర్మాత శోభూ యార్లగడ్డ స్పందించారు. ప్రస్తుతానికి ఆ తేది ఇంకా కన్ఫర్మ్ అవలేదు కానీ అందుకోసం అవసరమైన ప్రక్రియ మాత్రం మొదలైందన్నారు శోభూ యార్లగడ్డ. పీకే, బాహుబలి: ది బిగినింగ్, దంగల్ వంటి చిత్రాల్ని చైనాలో రిలీజ్ చేసిన డిస్ట్రిబ్యూటరే ఇప్పుడు 'బాహుబలి 2' సినిమాను కూడా విడుదల చేస్తున్నారు అని తెలిపారు శోభూ.
Samayam Telugu baahubali 2 chinese version release date not yet decided
'చైనాలో బాహుబలి 2' పుకార్లపై స్పందించిన నిర్మాత


కేవలం భారతీయ భాషల్లోనే రూ.1,500 కోట్లకిపైగా కలెక్షన్స్ వసూలు చేసి, ప్రస్తుతం రూ.2,000 కోట్ల కలెక్షన్స్ వైపు దూసుకుపోతోంది బాహుబలి 2. బాహుబలి 2 సినిమా విడుదల తర్వాత చైనాలో విడుదలైన దంగల్ సినిమా అక్కడి కలెక్షన్స్‌తో కలిపి రూ.1,000 కోట్ల క్లబ్‌లో చేరింది. అయితే, రేపోమాపో బాహుబలి 2 కూడా చైనాలో విడుదలైతే.. అక్కడి కలెక్షన్స్ కూడా కలుపుకుని బాహుబలి 2 కలెక్షన్స్ ఇంకా ఏ రేంజ్‌కి వెళ్తాయో అని అంచనాలు వేసుకుంటున్నారు ఇండియన్ ఆడియెన్స్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.