యాప్నగరం

బాలీవుడ్‌లో కొనసాగుతున్న 'బాహుబలి 2' హవా

బాహుబలి 2 సినిమా బాలీవుడ్‌లోనూ రికార్డులు సృష్టించడమేకాకుండా అక్కడి మెయిన్ స్ట్రీమ్ సినిమాలకి..

Samayam Telugu 27 May 2017, 5:04 pm
బాహుబలి 2 సినిమా బాలీవుడ్‌లోనూ రికార్డులు సృష్టించడమేకాకుండా అక్కడి మెయిన్ స్ట్రీమ్ సినిమాలకి సరికొత్త స్టాండర్డ్స్ సెట్ చేసి పెట్టింది. డబ్బింగ్ సినిమాగా రిలీజైనప్పటికీ... డైరెక్ట్ హిందీ సినిమాల రికార్డులని చెరిపేస్తూ అనతికాలంలోనే బాక్సాఫీస్ వద్ద టాప్ పొజిషన్‌లో నిలిచిందీ సినిమా. 'బాహుబలి 2' తర్వాత రిలీజైన ఏ సినిమాలు కూడా 'బాహుబలి -2'కి గట్టి పోటీ కాదు కదా.. కనీసం నామమాత్రపు పోటీని కూడా ఇవ్వలేకపోయాయి. దీంతో రిలీజైన మొదటి నాలుగు వారాల్లోనే కేవలం ఇండియాలోనే రూ.489 కోట్లు వసూలు చేసిన బాహుబలి 2 హిందీ వెర్షన్ ప్రస్తుతం రన్నింగ్‌లో వున్న ఐదో వారంతో రూ.500 కోట్లు వసూలు చేయబోతోంది. తాజాగా బాలీవుడ్ ట్రేడ్ ఎక్స్‌పర్ట్, ప్రముఖ క్రిటిక్ తరణ్ ఆదర్శ్ వెల్లడించిన గణాంకాల ప్రకారం ఇండియాలో బాహుబలి 2 హిందీ వెర్షన్ కలెక్షన్స్ ఇలా వున్నాయి.
Samayam Telugu baahubali 2 hindi version box office
బాలీవుడ్‌లో కొనసాగుతున్న 'బాహుబలి 2' హవా

#Baahubali2Week 1: ₹ 247 crWeek 2: ₹ 143.25 crWeek 3: ₹ 69.75 crWeek 4: ₹ 29.40 crTotal: ₹ 489.40 cr NETTHINDI. India biz.— taran adarsh (@taran_adarsh) May 27, 2017

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.