యాప్నగరం

ఆరడుగుల ఆజానుబాహుడు 'బాహుబలి' లేటెస్ట్ పోస్టర్

బాహుబలి 2 సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో అటు ఆ చిత్ర యూనిట్ సభ్యుల్లో, ఇటు ఆడియెన్స్‌లో...

Samayam Telugu 25 Apr 2017, 6:52 pm
బాహుబలి 2 సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో అటు ఆ చిత్ర యూనిట్ సభ్యుల్లో, ఇటు ఆడియెన్స్‌లో ఆత్రుత, ఉత్కంఠ అంతకంతకూ పెరిగిపోతున్నాయి. ఏప్రిల్ 28న బాహుబలి 2 రిలీజ్ కానున్న నేపథ్యంలో.. " మరో మూడు రోజుల్లో అమరేంద్ర బాహుబలి వచ్చేస్తున్నాడు" అని ఓ ట్వీట్ చేసిన ఫిలింమేకర్స్.. ఆ ట్వీట్‌తోపాటే అందుకు సంబంధించిన ఓ లేటెస్ట్ పోస్టర్‌ని కూడా విడుదల చేశారు. ఆరడుగుల ఆజానుబాహుడిలాగా అమరేంద్ర బాహుబలి నడిచి వస్తుండగా ఆ వెనకే మాహిష్మతి సామ్రాజ్యం కనిపించే విధంగా ఈ పోస్టర్‌ని డిజైన్ చేశారు.
Samayam Telugu baahubali 2 new poster released
ఆరడుగుల ఆజానుబాహుడు 'బాహుబలి' లేటెస్ట్ పోస్టర్

Amarendra Baahubali Arriving in 3 Days ... #Baahubali2. pic.twitter.com/P8XtQOo5Yn — Baahubali (@BaahubaliMovie) April 25, 2017
ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్‌గా సేవలు అందించిన సబు సిరిల్ మాహిష్మతి రాజ్యం అంటే నిజంగానే ఇలా వుంటుందా అని సంభ్రమాశ్చర్యాలకి గురయ్యే విధంగా సెట్స్ రూపొందించారు. మరోవైపు సినిమాటోగ్రాఫర్ కేకే సెంథిల్ కుమార్ సైతం బాహుబలి చిత్రంలోని ప్రతీ ఫ్రేమ్‌ని ఎంతో అందంగా తన కెమెరాలో బంధించారు. వీటన్నింటికితోడు అద్భుతమైన వీఎఫ్ఎక్స్ వర్క్ ఎలాగూ వుండనే వుంది.

రాజమౌళి చేతిలో రూపొందిన ఈ విజువల్ వండర్‌కి ప్రాణం పోస్తూ కీరవాణి అందించిన మ్యూజిక్ నిజంగానే 'సాహోరే బాహుబలి' అని అనుకునేలా చేసింది. అందుకే బాహుబలి 2 మూవీపై ఆడియెన్స్‌లో అన్ని అంచనాలు ఏర్పడటానికి కారణం అయింది బాహుబలి సినిమా. ప్రభాస్, రానా దగ్గుబాటి, రమ్యకృష్ణ, అనుష్క, సత్యరాజ్, తమన్నా వంటి లీడింగ్ స్టార్స్ నటించిన ఈ చిత్రం కోసం మరో మూడు రోజులు వేచిచూడక తప్పదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.