యాప్నగరం

అందుకే బాహుబలిని చంపాను అంటున్న కట్టప్ప

40 ఏళ్ల కెరీర్ తర్వాత నా అభిమానులు నా పేరుని సత్యరాజ్ అని కాకుండా కట్టప్ప అని పిలుచుకునేలా చేసిన సినిమా...

Samayam Telugu 26 Mar 2017, 10:01 pm
అందరికీ నమస్కారం. ప్రభాస్, రానా, రాజమౌళి అభిమానులకి స్పెషల్ నమస్కారం. 40 ఏళ్ల కెరీర్ తర్వాత నా అభిమానులు నా పేరుని సత్యరాజ్ అని కాకుండా కట్టప్ప అని పిలుచుకునేలా చేసిన సినిమా ఇది. బాహుబలి సినిమాలో కట్టప్పగా కీలక పాత్ర పోషించిన సత్యరాజ్ బాహుబలి-2 ప్రి-రిలీజ్ ఈవెంట్‌లో మాట్లాడిన మాటలివి.
Samayam Telugu baahubali 2 pre release event highlights
అందుకే బాహుబలిని చంపాను అంటున్న కట్టప్ప


బాహుబలి సినిమా మొదటి భాగం రిలీజైనప్పటి నుంచి ఇండియన్ సినిమా ఆడియెన్స్‌ని వేధిస్తోన్న ఏకైక ప్రశ్న.. 'కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు' అని. ఇదే ప్రశ్న ఇదే వేదికపై కట్టప్ప(సత్యరాజ్)కి కూడా ఎదురైంది. అయితే, ఈ ప్రశ్నకి స్పందించిన సత్యరాజ్ ఫన్నీగా తనదైన స్టైల్లో సమాధానం ఇచ్చారు. "నిర్మాతలు తనకి డబ్బులు ఇచ్చారు. దర్శకుడు రాజమౌళి బాహుబలిని చంపమని చెప్పారు. అందుకే తాను బాహుబలిని చంపాను" అని ఫన్నీగా సమాధానం ఇచ్చిన సత్యరాజ్... అంతకన్నా ఎక్కువ తానేమీ చెప్పదల్చుకోలేదని తప్పించుకున్నారు. ఇంకా ఏదైనా వుంటే ఆ సందేహాలన్నీ రాజమౌళిని అడిగి తెలుసుకోవాల్సిందిగా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయారు సత్యరాజ్. సత్యరాజ్ ఇచ్చిన సమాధానం ఆడియెన్స్‌ని సంతృప్తిపర్చలేకపోయినా... కడుపుబ్బా నవ్వుకునే అవకాశాన్ని మాత్రం కల్పించింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.