సినీ ప్రేమికులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న బాహుబలి ట్రైలర్ ను చిత్రయూనిట్ గురువారం ఉదయం విడుదల చేసింది. హైదరాబాద్ లోని సినీమ్యాక్స్ లో తెలుగు ట్రైలర్ ను విడుదల చేసింది. ఈ కార్యక్రమానికి చిత్ర యూనిట్ మొత్తం తరలి వచ్చింది. హీరోయిన్లు మాత్రం హాజరుకాలేదు. ఈ సందర్భంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు జక్కన్న. ఆ ప్రెస్ మీట్ కు దర్శకుడు రాజమౌళితో పాటూ శోభు యార్లగడ్డ, ప్రభాస్, రానా, సెంథిల్ కుమార్, దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లోని థియేటర్లలో బాహుబలి 2 ట్రైలర్ను విడుదల చేశారు. కాగా తెలుగుతో పాటూ తమిళ, హిందీ భాషల్లో కూడా ట్రైలర్ ను విడుదల చేశారు. మొదట 1 నిమిషం 52 సెకన్ల నిడివి గల తమిళ ట్రైలర్ విడుదలైంది. అలాగే హిందీ ట్రైలర్ బాలీవుడ్ దర్శకుడు కరణ్ జోహార్ ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. అది కేవలం 24 సెకన్లే ఉంది. ఇక తెలుగు ట్రైలర్ రెండు నిమిషాల 24 సెకన్ల నిడివి కలిగి ఉంది.
ట్రైలర్ బాహుబలి2 పై పెట్టుకున్న అంచనాల పెంచేలా ఉంది. చాలా ఆసక్తికర సన్నివేశాలు అందులో ఉన్నాయి. ఉత్కంఠభరిత సన్నివేశాలు సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న అసక్తిని అమాంతం పెంచేసింది.
ట్రైలర్ బాహుబలి2 పై పెట్టుకున్న అంచనాల పెంచేలా ఉంది. చాలా ఆసక్తికర సన్నివేశాలు అందులో ఉన్నాయి. ఉత్కంఠభరిత సన్నివేశాలు సినిమా ఎప్పుడెప్పుడు చూస్తామా అన్న అసక్తిని అమాంతం పెంచేసింది.