యాప్నగరం

కో-ఆర్టిస్ట్ చెంప ఛెళ్లుమనిపించిన బాహుబలి బ్యూటీ

ఈ విషయాన్ని యూనిట్ వర్గాలు సైతం నిజమేనని అంగీకరించాయి. ఆమె అతడి చెంప ఛెళ్లుమనిపించిన...

TNN 1 Aug 2017, 4:53 pm
బాహుబలి: ది బిగినింగ్ సినిమాలో ప్రభాస్ సరసన మనోహరి అంటూ స్టెప్పేసిన బ్రిటీష్ మోడల్, హీరోయిన్ స్కార్లెట్ విల్సన్ తన సహ నటుడి చెంప ఛెళ్లుమనిపించింది. ప్రస్తుతం బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న హన్సా: ఏక్ సన్యోగ్ సినిమాలో ఓ ఐటంసాంగ్ చేస్తోంది ఈ బ్రిటీష్ బ్యూటీ. ఇదే సినిమాలో స్కార్లెట్‌తో కలిసి నటిస్తున్న ఉమాకాంత్ రాయ్ ఆమెతో కొంత అసభ్యంగా ప్రవర్తించాడట. ఉమాకాంత్ రాయ్ ప్రవర్తన తీరు నచ్చని స్కార్లెట్ మొదట అతడిని లైట్ తీసుకుని దూరం పెట్టే ప్రయత్నం చేసినప్పటికీ... ఇదే అలుసుగా తీసుకున్న ఉమాకాంత్ రాయ్ ఈసారి మరో అడుగు ముందుకేసి ఆమెని అభ్యంతరకరంగా తాకే ప్రయత్నం చేశాడట. దీంతో ఉమాకాంత్ దుష్ప్రవర్తనపై విసుగుచెందిన స్కార్లెట్ అతడి చెంప ఛెళ్లుమనిపించిందట.
Samayam Telugu baahubali actress slapped co star for misbehaving with her
కో-ఆర్టిస్ట్ చెంప ఛెళ్లుమనిపించిన బాహుబలి బ్యూటీ


ఈ విషయాన్ని యూనిట్ వర్గాలు సైతం నిజమేనని అంగీకరించాయి. ఆమె అతడి చెంప ఛెళ్లుమనిపించిన తర్వాత తామే అతడికి దేహశుద్ధి చేసి సెట్‌లోంచి తరిమేశామని అన్నారు యూనిట్ సభ్యులు. ఈ విషయంలో ఉమాకాంత్‌పై కోపంతో వున్న స్కార్లెట్.. అతడు తనకి క్షమాపణలు చెప్పకపోతే, ఫిలిం ఫెడరేషన్ ఆఫ్ ఇండియాకు ఫిర్యాదు చేసి అతడి యాక్టింగ్ లైసెన్స్ రద్దు చేయిస్తానని వార్నింగ్ ఇచ్చిందట.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.