యాప్నగరం

రాజమౌళి శిష్యుడి కొత్త లవ్ స్టోరీ!

బాహుబలి మూవీతో ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించిన దర్శకధీరుడు రాజమౌళి ఎంతో మంది యువ దర్శకులకు మార్గదర్శకం అయ్యారు.

TNN 20 Oct 2017, 5:34 pm
బాహుబలి మూవీతో ప్రపంచ వ్యాప్తంగా పేరు సంపాదించిన దర్శకధీరుడు రాజమౌళి ఎంతో మంది యువ దర్శకులకు మార్గదర్శకం అయ్యారు. రాజమౌళి దగ్గర దర్శకత్వ మెళకువలను నేర్చుకునేందుకు అనేక మంది యువదర్శకులు పోటీపడుతుంటారు. ఇలా రాజమౌళి స్కూల్‌‌లో పనిచేసిన కరుణ కుమార్.. జక్కన్న శిష్యుడిగా ఉంటూనే గతంలో యంగ్ హీరో నితిన్‌తో ‘ద్రోణ’ సినిమాను డైరెక్ట్ చేశారు. అయితే ఈ యువ దర్శకుడు లాంగ్ గ్యాప్ తరువాత ఓ యూత్ ఫుల్ లవ్ స్టోరీతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.
Samayam Telugu baahubali director rajamouli associate karun kumar new film
రాజమౌళి శిష్యుడి కొత్త లవ్ స్టోరీ!


సుమంత్ అశ్విన్ హీరోగా తెరకెక్కుతున్న ఈ మూవీకి శివకుమార్ నిర్మాతగా వ్యవహరించనున్నారు. దర్శకుడుగా తొలి చిత్రంతో ఆకట్టుకోలేకపోయిన రాజమౌళి శిష్యుడు కరుణ కుమార్ కొత్త ప్రేమకథా చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని.. ఈ సినిమా సుమంత్ అశ్విన్ కెరియర్‌లో బెస్ట్ మూవీగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు చిత్ర యూనిట్.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.