యాప్నగరం

రాజమౌళి ఎమోషనల్ స్పీచ్: చావుకే వార్నింగ్ ఇచ్చిన నటుడాయన

స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు పేరు మీద తనకు జాతీయ అవార్డ్ ఇవ్వడం తన బాధ్యతను రెట్టింపు చేసిందన్నారు దర్శకుడు రాజమౌళి.

TNN 18 Sep 2017, 11:20 am
స్వర్గీయ అక్కినేని నాగేశ్వరరావు పేరు మీద తనకు జాతీయ అవార్డ్ ఇవ్వడం తన బాధ్యతను రెట్టింపు చేసిందన్నారు దర్శకుడు రాజమౌళి. ఆదివారం సాయంత్రం శిల్పకళావేదికలో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ‘అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డ్ 2017’ అందుకున్నారు రాజమౌళి. ఈ సందర్భంగా మాట్లాడుతూ అక్కినేని నాగేశ్వరరావు గుండె ధైర్యం గురించి సభకు తెలియజేస్తూ ఎమోషన్ అయ్యారు.
Samayam Telugu baahubali director ss rajamouli emotional speech at anr national award function 2017
రాజమౌళి ఎమోషనల్ స్పీచ్: చావుకే వార్నింగ్ ఇచ్చిన నటుడాయన


రాజమౌళి మాటల్లో... 1974లో అక్కినేని నాగేశ్వరరావు గారికి గుండె నొప్పి వచ్చింది, అప్పుడు డాక్టర్లు ఆయనకు ఆపరేషన్ చేసి మీరు 14 సంవత్సరాలు పాటు ఎలాంటి ఇబ్బందిలేకుండా బ్రతుకుతారని గ్యారంటీ ఇచ్చారు. వాళ్లు చెప్పినట్టుగానే 14 సంత్సరాల తరువాత అంటే 1988లో మళ్లీ ఆయనకు గుండెనొప్పి వచ్చింది. అప్పుడు మళ్లీ డాక్టర్‌లు ఓపెన్ హార్ట్‌ సర్జరీ కోసం హార్ట్‌ను ఓపెన్ చేశారు అయితే ఆయన హార్ట్ బలహీనంగా ఉండటంతో ఆపరేషన్ సాధ్యం కావడంలేదు ఇక బ్రతకడం కష్టం అని డాక్టర్స్ ఏఎన్నార్‌కు చెప్పేశారు. అప్పుడు ఏఎన్నార్ ఏం పర్లేదు డాక్టర్లు, మందుల సాయంతో 14 సంవత్సరాలు గడిపా.. ఇప్పుడు నాకు అవేం అవసరంలేదు కేవలం నా గుండె ధైర్యంతోటే ఇంకో 14 సంవత్సరాలు బ్రతుకుతా అని... అప్పటి నుండి ఆయన కార్లన్నింటికీ 2002 అనే నంబర్ పెట్టారు.

అంటే 2002 వరకూ చావు నాదగ్గరకు రాదని గుండె ధైర్యంతో 2002 వరకూ బ్రతికారు. అప్పుడు నేను 2002 అనే అనుకున్నాను ఇంకా చావు నాదగ్గరకు రాలేదేంటని ఏఎన్నార్ అనుకున్న సందర్భంలో ఆయనకు 9 నంబర్ కనిపించిందట. అంటే ఇంకో తొమ్మిది సంవత్సరాల వరకూ చావు నా దగ్గరకు రాదు మాట అని ఆయన ఫిక్స్ అయ్యారు. ఇవన్నీ ఆయన ఎవరితోటో చెప్పలేదు ఆయనకు ఎదురుగా నిలిచిన చావుతోనే మాట్లాడారు. చావు ఎదరైన ప్రతిసారీ ఆ చావుకే వార్నింగ్ ఇచ్చిన గొప్ప గుండెధైర్యం ఉన్న నటుడే ఏఎన్నార్.

ఇలా నేను రమ్మన్నప్పుడే చావు నాదగ్గరకు రా అని పిలిచిన వాళ్లలో నాకు తెలిసి మహాభారతంలో భీష్మాచార్యులు ఉన్నారు, కలియుగంలో ఏఎన్నార్ మాత్రమే ఉన్నారన్నారు రాజమౌళి. అలాంటి మహానుభావుడు పేరు మీద నాకు అవార్డ్ ఇవ్వడం నేను ఇంకా కష్టపడాలని గుర్తుచేస్తుందని అందుకే నా శక్తి మేర కష్టపడతానన్నారు రాజమౌళి. ఈ కార్యక్రమంలో భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సీఎం కేసీఆర్‌లతో పాటు అక్కినేని నాగార్జున, ఆయన సోదరుడు అక్కినేని వెంకట్‌ పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.