పెద్ద సినిమా విడుదలౌతుందంటే దర్శకులు, నిర్మాతలు, ప్రేక్షకుల చూపు బాహుబలి రికార్డులపై ఉంటుంది. దర్శకధీరుడు రాజమౌళి రూపొందించిన బాహుబలి చిత్రం తెలుగు సినిమా రూపురేఖల్ని, సరిహద్దుల్ని మార్చివేసింది. తెలుగోడి సినీ సత్తాను ప్రపంచానికి బాహుబలి చిత్రంతో రుచి చూపాడు దర్శకుడు రాజమౌళి. ఈ చిత్రం తరువాత విడుదలైన పెద్ద చిత్రాలు నాన్ బాహుబలి రికార్డుల్ని మాత్రమే బ్రేక్ చేయగలుగుతున్నాయి తప్ప.. బాహుబలి రికార్డ్స్‌ని బీట్ చేయలేకపోతుందంటే దర్శకధీరుడు బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్లో పాగా వేశాడో అర్దం చేసుకోవచ్చు.
అందుకే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లు తెరకెక్కుతున్నప్పుడు ఈసారి బాహుబలి రికార్డ్‌లు పగిలిపోవడం ఖాయమే అనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ‘సాహో’ చిత్రం బాహుబలి రికార్డ్స్‌ని బీట్ చేస్తుందని అంచనాలేసినా అవి తలక్రిందులయ్యాయి. ఇప్పుడు బాహుబలి రికార్డ్స్‌ని బీట్ చేయడం ‘సైరా’కి పెద్ద కష్టం కాదంటున్నారు విశ్లేషకులు. బుధవారం నాడు విడుదలైన ట్రైలర్‌తో ఈ సినిమాపై ఉన్న అంచనాలు రెట్టింపయ్యాయి.
కాగా హిస్టారికల్ మూవీతో హిస్టరీ క్రియేట్ చేసేందుకు వస్తున్న మెగాస్టార్ చిరంజీవి ‘సైరా’ మూవీ ట్రైలర్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది. బాహుబలి దర్శకుడు రాజమౌళి సైతం ఈ ట్రైలర్ థ్రిల్లింగ్ అంటూ పొగడ్తల వర్షం కురిపించారు. ‘దర్శకుడు సురేందర్ రెడ్డి హార్డ్ వర్క్ ట్రైలర్లో కనిపిస్తోంది. నిర్మాత రామ్ చరణ్ తేజ్ నిర్మాణ విలువలు అద్భుతం.. చిరంజీవి గారూ మీరు దండాలు’ అంటూ ఎమోజీలను పోస్ట్ చేశారు రాజమౌళి.