యాప్నగరం

​‘సాహో’కి హీరోయిన్ ఫిక్స్.. ప్రభాస్ సరసన ఆమె..!

అంతిమంగా ఈ ఛాన్స్ ఎవరికనే అంశంపై క్లారిటీ వచ్చింది. ప్రభాస్ తో జతకట్టబోతున్నది ఎవరో స్పష్టం అవుతోంది.

TNN 8 Jun 2017, 11:52 am
బాహుబలి తర్వాత ప్రభాస్ చేస్తున్న ‘సాహో’ సినిమాలో హీరోయిన్ గా చాలా మంది పేర్లు వినిపించాయి. శ్రద్ధా కపూర్, దిశా పటానీ వంటి వాళ్లతో పాటు పలువురు బాలీవుడ్ హీరోయిన్ల పేర్లు కూడా ఈ సినిమాలో నటించబోతున్నారన్నట్టుగా వినిపించాయి. అయితే.. అంతిమంగా ఈ ఛాన్స్ ఎవరికనే అంశంపై క్లారిటీ వచ్చింది. ప్రభాస్ తో జతకట్టబోతున్నది ఎవరో స్పష్టం అవుతోంది.
Samayam Telugu baahubali pair team up again for saaho
​‘సాహో’కి హీరోయిన్ ఫిక్స్.. ప్రభాస్ సరసన ఆమె..!


ఆమె మరెవరో కాదు.. అనుష్క. అవును.. మిర్చి, బాహుబలి సినిమాల్లో ప్రభాస్ కు జోడీగా నటించిన అనుష్కనే వరసగా మరో సినిమాలో ఆ హీరోతో నటించబోతోంది. ప్రభాస్ సరసన ఎవరనే అంశం పై అనేక మంది హీరోయిన్లను పరిగణనలోకి తీసుకున్న సాహో యూనిట్ చివరకు అనుష్క వద్దకే వచ్చి ఆగిపోయింది. ప్రభాస్ కు సరిజోడు ఆమె అని ఫిక్సయ్యిందని తెలుస్తోంది.

కొంతమంది బాలీవుడ్ హీరోయిన్లను అనుకున్నా.. రెమ్యూనరేషన్ వద్ద తేడాలు వచ్చాయి. వారికి భారీ మొత్తాన్ని ఇవ్వడానికి ‘సాహో’ యూనిట్ వెనుకాడినట్టుగా వార్తలు వచ్చాయి. ఆ క్రమంలోనే అనుష్కను పరిగణనలోకి తీసుకున్నారు. అయితే వరసగా ప్రభాస్, అనుష్కలే ప్రతి సినిమాలోనూ జోడీగా కనిపిస్తే ప్రేక్షకులకు బోర్ కొడుతుందేమో అని కొంత ఆలోచనలో పడినా, చివరకు అనుష్కనే ఖరారు చేసుకున్నట్టుగా తెలుస్తోంది.

మరోవైపు ప్రభాస్, అనుష్కల మధ్య ప్రేమాయణం అనే ఊహాగానాలున్నాయి. వాటిని ఖండించడానికి అనుష్క ప్రయాస పడుతోంది. అలాంటి ప్రచారం చేసిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని కూడా ఆమె హెచ్చరికలు జారీ చేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.