యాప్నగరం

జనవరి 11 నుంచి రష్యాలో ‘బాహుబలి’ సందడి!

జనవరి 11న రష్యాలో ‘బాహుబలి-2’ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. రష్యా భాషకు సంబంధించిన ట్రైలర్‌ను ట్విట్టర్‌లో పోస్టు చేశారు.

TNN 26 Dec 2017, 4:00 pm
తెలుగు సినిమా సత్తాను ప్రపంచానికి చాటి చెప్పిన చిత్రం ‘బాహుబలి’. 2017లో భారత్‌లో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభించింది. రెండు భాగాలుగా విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించింది. ఇప్పటికే పలు భాషల్లో విడుదలైన ఈ సినిమాను ఇప్పుడు మరిన్ని భాషల్లో రిలీజ్ చేయడానికి సిద్ధం చేశారు. జనవరి 11న రష్యాలో ‘బాహుబలి-2’ విడుదల చేయనున్నట్లు చిత్రబృందం తెలిపింది. రష్యా భాషకు సంబంధించిన ట్రైలర్‌ను ట్విట్టర్‌లో పోస్టు చేస్తూ.. ఈ విషయం వెల్లడించారు.
Samayam Telugu baahubali2 to be released in russia on jan 11 here is russian trailer
జనవరి 11 నుంచి రష్యాలో ‘బాహుబలి’ సందడి!


డిసెంబర్ 29న జపాన్‌లో బాహుబలి-2 సినిమా విడుదల కాబోతుంది. చైనాలోనూ బాహుబలి సినిమాను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తున్నట్టు నిర్మాత శోభు యార్లగడ్డ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.