యాప్నగరం

బాహుబలి2 వీడియో సాంగ్ ప్రోమో రిలీజ్

బాహుబలి2 మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడటంతో మూవీ యూనిట్ ప్రమోషన్‌లో వేగం పెంచింది. భళి భళిరా భళి.. సాహోరే బాహుబలి అంటూ సాగే పాట వీడియో సాంగ్ ప్రోమోను బాహుబలి టీమ్ విడుదల చేసింది.

TNN 22 Apr 2017, 6:08 pm
బాహుబలి2 మూవీ రిలీజ్ డేట్ దగ్గరపడటంతో మూవీ యూనిట్ ప్రమోషన్‌లో వేగం పెంచింది. భళి భళిరా భళి.. సాహోరే బాహుబలి అంటూ సాగే పాట వీడియో సాంగ్ ప్రోమోను బాహుబలి టీమ్ విడుదల చేసింది. బాహుబలి పార్ట్1 తో పోల్చుకుంటే బాహుబలి కన్‌క్లూజన్ విషయంలో ట్రైలర్ , ఒకటి రెండు పోస్టర్ తప్పితే విజువల్స్‌ను చాలా సీక్రెట్‌గా ఉంచాడు రాజమౌళి . తాజాగా రిలీజ్ చేసిన బాహుబలి2 టైటిల్ సాంగ్ ప్రోమోలో కొన్ని విజువల్స్‌ను రివీల్ చేశారు.
Samayam Telugu baahubali2saahore baahubali vodeo song promo released
బాహుబలి2 వీడియో సాంగ్ ప్రోమో రిలీజ్


ఈ ప్రోమో వీడియోలో ప్రభాస్ డిఫరెంట్ లుక్స్‌లో కనిపిస్తున్నాడు. ఏనుగు తొండానికి ఓ అతిపెద్ద విల్లు అమర్చి, దాని నుంచి ఒక్క చేత్తో నిప్పులు చిమ్మే అతిపెద్ద బాణాన్ని సంధించడం లాంటి దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి.
సాహోరే బాహుబలి సాంగ్ ప్రోమో:

గుర్రం మీద దూసుకురావటం.. ఆ తర్వాత సింహాసనం మీద అధిష్టించడం.. ఆ సమయంలో వేలాది మంది మాహిష్మతీ ప్రజలు పూలతో స్వాగతం పలకడం... ఆపై ఏనుగు మీద సవారీ చేస్తూ ప్రభాస్ వస్తుంటే ముందు కట్టప్ప, శివగామి ఉండటం, ప్రజల జయజయ ధ్వానాల మధ్య ఇద్దరు చిన్న పిల్లలను చెరో భుజం మీద ఎక్కించుకుని తీసుకురావడం లాంటి సన్నివేశాలన్నీ ఈ పాటలో ఉన్నాయి.

లహరి మ్యూజిక్, టీ సిరీస్ సంయుక్తంగా ఈ వీడియోను విడుదల చేసిన ఈ వీడియోకు యూట్యూబ్‌లో రెస్పాన్స్ అదిరిపోతుంది. పోస్ట్ చేసిన అరగంటలోనే 50 వేల వ్యూస్‌ను క్రాస్ చేసి.. లక్ష వైపు దూసుకుపోవడంతో బాహుబలి మానియా ఎలా ఉందో అంచనా వేయడానికి ఈ ఒక్క వీడియో చాలు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.