యాప్నగరం

Anandayya: ఆయుర్వేదం బిజినెస్‌లోకి జగపతిబాబు.! అమ్మ నా చట్నీ అంటూ బాబు గోగినేని షాకింగ్ పోస్ట్

ఇటీవల జగపతిబాబు ఆనందయ్య ఆయుర్వేదాన్ని సపోర్ట్ చేస్తూ మీడియా ముందుకు వచ్చి నమ్మకం వ్యక్తం చేశారు. తాను కూడా ఆనందయ్య ముందు తీసుకున్నానని కరోనా రాలేదని ధీమా వ్యక్తం చేశారాయన.

Samayam Telugu 11 Jun 2021, 9:52 pm
‘ఎవడు నమ్మినా.. నమ్మకపోయినా.. నేను నమ్ముతున్నా.. ఆయుర్వేదం అనేది తప్పు చేయదు.. శరీరానికి హానిచేయదు. నేచర్, భూదేవి తప్పు చేయదు. ప్రజల్ని కాపాడటానికి ప్రకృతి ఆనందయ్య మందు రూపంలో మన ముందుకు వచ్చింది.. ఈ ప్ర‌పంచాన్ని కాపాడుతుంద‌ని ఆశిస్తున్నా.. ఆనందయ్యని దేవుడు ఆశీర్వ‌దించాలి’ ఇటీవల ఆనందయ్య మందుపై హీరో జగపతి బాబు చేసిన కామెంట్స్ ఇవి. అంతేకాదు.. ఆనంద‌య్య గారి మందు శాస్త్రీయంగా అనుమ‌తి పొందుతుంద‌ని ఆశాభావం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు జగపతిబాబు.
Samayam Telugu జగపతిబాబు
Babu Gogineni On Jagapathi Babu


అదే సందర్భంలో మీడియా ముందుకు వచ్చిన ఆయన.. ఆనందయ్య మందుపై పూర్తి నమ్మకం వ్యక్తం చేస్తూ.. అందరికంటే ముందుగా ఆనందయ్య ఆయుర్వేద మందుని వాడిన వాళ్లలో నేను ఒకడ్ని అని.. ఆల్రెడీ నేను ఆనందయ్య మందు వాడాను.. నాకు కరోనా రాలేదని మీడియా పూర్వకంగా కుండబద్దలు కొట్టినట్టు చెప్పారు జగపతి బాబు.

అయితే తొలి నుంచి ఆనందయ్య మందుపై కత్తి కట్టిన బిగ్ బాస్ ఫేమ్, హేతువాది బాబు గోగినేని హీరో జగపతి బాబుపై వ్యంగ్యాస్త్రాలు విసురుతూ ఫేస్ బుక్‌లో పోస్ట్ పెట్టారు. జగపతిబాబు ఆయుర్వేదం బిజినెస్‌లోకి అడుగుపెట్టబోతున్నారంటూ ఓ ఆంగ్ల సినీ వెబ్ సైట్‌లో వార్త రావడంతో దాన్ని షేర్ చేస్తూ.. జగపతిబాబుపై సెటైర్లు వేశారు బాబు గోగినేని.

‘అమ్మ నాటీ! తమరు దుకాణం తెరవబోతున్నట్టు చెప్పకుండా.. ఆనందయ్య చట్నీ గుణగణాలు మెచ్చుకుంటూ మాట్లాడటం భలే బిజినెస్ టాక్టిక్ యాక్టర్ గారూ.. కానీ తెలివైనవాడు ఎవడైనా కొంచెం ఆగి చెప్పేవాడు. ఈ ఆత్రం మనకే చేటు’ అంటూ జగపతిబాబుపై పోస్ట్‌ పెట్టారు బాబు గోగినేని.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.