సినిమా : పైసా వసూల్
విడుదల తేదీ: సెప్టెంబర్ 1, 2017
దర్శకుడు: పూరి జగన్నాధ్
నిర్మాత: వి. ఆనంద్ ప్రసాద్
సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్
నటీనటులు: బాలకృష్ణ, శ్రీయా శరణ్, కైరాదత్,మస్కాన్
మేరా నామ్ తేడా.. ‘తేడా సింగ్’.. ధిమాక్ తోడా.. చాలా తేడా, గొడవల్లో గోల్డ్ మెడల్ కొట్టినోడ్ని మళ్లీ టోర్నమెంట్లు పెట్టొద్దంటున్నాడు నందమూరి బాలయ్య. టాలీవుడ్ టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పైసా వసూల్’ అభిమానుల భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 1 న విడుదలై థియేటర్స్‌లో సందడి చేస్తుంది.
ఇక ప్రివ్యూ విషయానికి వస్తే.. బాలకృష్ణ-పూరీ కాంబినేషన్ నుండి కోరుకునే అంశాలన్నీ పుష్కలంగా ఉన్నాయి. ఫుల్ ఎనర్జిటిక్ క్యారెక్టర్ని బాలయ్య అద్భుతంగా పోషించారు. బాలయ్య ప్రతి డైలాగ్లోనూ పూరీ మార్క్ కనిపిస్తుంది. బీహార్ నీళ్లు తాగినోళ్లని తీహార్‌లో పోయించా.. తూ క్యారే హౌలే అంటూ విలన్లను తనదైన శైలిలో ఎగరేసి మరీ చెడుగుడు ఆడేస్తున్నాడు బాలయ్య బాబు. నాది నేల టిక్కెట్ బ్యాచ్ రామక్రిష్ణ థియేటర్ సందుల్లో పెరిగా అంటూ మాస్ పంచ్ పేల్చేస్తున్నాడు.
అంతేకాదు అరె మామా.. ఏక్ పెగ్గురా అంటూ పాటకూడా పాడేశారు బాలయ్య. నేనింతే కసి తీరకపోతే శవాన్ని లేపి మరీ చంపేస్తా అంటూ భారీ డైలాగ్స్‌తో విరుచుకుపడుతున్నాడు. తొడకొట్టి మరీ... వన్స్ నా స్క్రూ లూస్ అయితే నేనిలాగే ఉంటా అంటూ బాలయ్య వీర లెవల్లో ఫుల్ ఎనర్జీతో ఫైట్లు.. యాక్షన్ సీన్లులలో విలన్లను దబిడిదిబిడి వాయించేస్తున్నాడు.
అసలే మాటలను తూటాల్లా పేల్చే పూరీ పెన్ను బాలయ్యకు కోసం బాగా వాడేశాడు. అయితే కొన్ని డైలాగ్స్‌లో అతి ఎక్కువగా ఉందనిపిస్తున్నప్పటీ అది బాలయ్య చెప్తుండటంతో కవర్ అయిపోయింది. ఇక ఈ మూవీలో అనూప్ రూబెన్స్ సంగీతం, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదనించినా శ్రీయ, ముస్కాన్ అందాలతో ఊరిస్తుంటే.. కైరాదత్ ఆ ఐటెం సాంగుతో కనువిందు చేసింది. ఈ సినిమాలో ప్రముఖ బాలీవుడ్–హాలీవుడ్ నటుడు కబీర్ బేడి ప్రత్యేక పాత్ర పోషించగా అలీ, పృథ్వీ, పవిత్రా లోకేష్, విక్రమ్ జిత్లను బాగానే వాడుకున్నాడు పూరీ. అయితే ‘పైసా వసూల్’ పూరి పాత చింతకాయ పచ్చడి కథే అయినా బాలయ్య బాగానే లాక్కొచ్చాడనేది ఆడియన్స్ నుండి ఎక్కువగా వినిపిస్తున్నమాట.
తెలుగు సమయం నుండి ‘పైసా వసూల్’ సినిమా సమీక్ష మరియు రేటింగ్స్ కోసం వేచి ఉండండి.
Also read: Paisa Vasool movie review & rating
Also read: Paisa Vasool Tweet Review & Ratings