యాప్నగరం

Nara Brahmani: నాన్నకు ప్రేమతో నారా బ్రహ్మణి.. ఆ పోస్ట్‌లు చూస్తుంటే అంటూ భావోద్వేగం

నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు నందమూరి అభిమానులు. ఇప్పటికే ఆయన కామన్ బర్త్ డే డీపీ వైరల్ అవుతుంది.

Samayam Telugu 8 Jun 2020, 1:14 pm
బుధవారం (జూన్ 10) నాడు నందమూరి నటసింహం బాలకృష్ణ 60వ పుట్టినరోజు కావడంతో ఆయన అభిమానులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ.. నందమూరి అభిమానులు ప్రతిఒక్కరూ ఇంట్లోనే కేక్ కట్ చేసుకోవాలని నిర్ణయానికి వచ్చారు. బాలకృష్ణ 60 సంవత్సరంలోకి అడుగుపెట్టబోతుండగా.. నంద‌మూరి అభిమానుల‌కు పెద్ద పండగలా భావిస్తున్న తరుణంలో ఆయన కూతురు, నారా లోకేష్ భార్య నారా బ్రాహ్మణి ఎమోషనల్ పోస్ట్‌ను ప్రేక్షకులతో షేర్ చేసుకున్నారు.
Samayam Telugu నారా బ్రాహ్మణి, బాలకృష్ణ (Nara Brahmani On Balakrishna)
Nara Brahmani On Balakrishna


ఈ వీడియోలో బ్రాహ్మణి మాట్లాడుతూ.. ‘నాన్నగారి అభిమానులందరికీ నమస్కారం.. నాన్న (బాలకృష్ణ) గారి 60వ జన్మదిన వేడుకలను చాలా ఘనంగా నిర్వహిస్తూ ఆయన అభిమానులు సోషల్ మీడియాలో పోస్ట్‌లు పెడుతున్నారు. అలాగే నాన్న గారి వ్యక్తిత్వాన్ని తెలియజెప్పే విధంగా ఉన్న ఇంట్రస్టింగ్ పోస్ట్, హ్యాష్ ట్యాగ్స్ క్రియేట్ చేస్తున్నారు. వాటిని చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ.. చాలా రెస్పాన్స్‌గా సేవా కార్యక్రమాలను చేపడుతున్నారు.

అన్నింటికంటే నాకు గర్వంగా అనిపిస్తున్న విషయం ఏంటంటే.. ఈ సంవత్సరం నాన్న గారి పుట్టినరోజుని అభిమానులంతా మీ ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో జరుపుకోవాలని నిర్ణయించుకున్నారు. ఇది చాలా ఆనందాన్ని కలిగిస్తుంది. మీరు సేఫ్‌గా ఉండటమే కాదు.. మీ చుట్టూ ఉండేవారంతా సేఫ్‌గా ఉండాలని కోరుకుంటున్నారు. మీరు ఎల్లప్పుడూ మా ఫ్యామిలీ మెంబర్‌లాంటి వారు. అంతే కాకుండా నాన్న గారికి ఎలాంటి క్రమశిక్షణ ఉందో.. అదే క్రమశిక్షణ మీకు కూడా ఉండటం హ్యాపీగా ఉంది. మీరు ఎల్లప్పుడూ మీ ప్రేమాభిమానాలు ఇలాగే మా ఫ్యామిలీపై ఉంచాలని కోరుకుంటూ మీ బ్రాహ్మణి నారా’.. అంటూ బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా ఎమోషనల్ వీడియోను షేర్ చేసుకున్నారు ఆమె కూతురు నారా బ్రాహ్మణి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.