యాప్నగరం

బాలయ్య తండ్రిలాంటి వారు: నయన్

బాలయ్యను అంతా సహ నటుడు, హీరోగానే చూస్తారు. కానీ, నేను మాత్రం ఆయన్ను తండ్రిలా భావిస్తాను. ఆయన్ను చూడగానే దణ్ణం పెట్టాలనిపిస్తుంది. ఆయన ఎంతో సౌమ్యుడు.

TNN 30 Dec 2017, 9:07 pm
బాలకృష్ణతో మూడు చిత్రాల్లో కలిసి నటించిన నయనతార ఆయనతో తనకు ఉన్న బంధంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... ‘‘బాలయ్యను అంతా సహ నటుడు, హీరోగానే చూస్తారు. కానీ, నేను మాత్రం ఆయన్ను తండ్రిలా భావిస్తాను. ఆయన్ను చూడగానే దణ్ణం పెట్టాలనిపిస్తుంది. ఆయన ఎంతో సౌమ్యుడు. ఆయనతో ఇప్పటి వరకు మూడు సినిమాలు చేశాను. కానీ, ఇప్పటి వరకు నాకు ఆయన నుంచి ఎలాంటి ఇబ్బంది కలగలేదు. ఆయన నన్ను ఎంతో జాగ్రత్తగా, తండ్రిలా చూసుకుంటారు. అందుకే ఆయన్ని నేను మా సొంత కుటుంబ సభ్యుడిగా భావిస్తాను. ఆయనతో నటించడానికి నేనెప్పుడూ సిద్ధమే’’ అని అంది.
Samayam Telugu balakrishna is like my father nayantara
బాలయ్య తండ్రిలాంటి వారు: నయన్


నయన్, బాలకృష్ణ జంటగా ‘సింహా, శ్రీరామరాజ్యం’ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. మరోసారి వీరిద్దరు ‘జైసింహా’తో జతకట్టారు. ఈ సినిమా జనవరి 12న విడుదల కానుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.