యాప్నగరం

బాలయ్య 103: రామారావు గారు..?

‘పైసావసూల్’ తర్వాత బాలయ్య చేయబోతున్న సినిమా ఏది? అంటే..

TNN 4 Sep 2017, 2:58 pm
‘పైసావసూల్’ తర్వాత బాలయ్య చేయబోతున్న సినిమా ఏది? అంటే.. ఆసక్తిదాయకమైన టైటిల్ వినిపిస్తోంది. బాలయ్య 103వ సినిమాగా రూపొందే దాని టైటిల్ పేరు ‘రామారావు గారు’ అనే మాట వినిపిస్తోంది.
Samayam Telugu balakrishna to do a movie titled ramarao garu
బాలయ్య 103: రామారావు గారు..?


ఆసక్తి రేపుతున్న ఈ టైటిల్ కు సంబంధించిన కథను ఇప్పటికే బాలయ్యకు వివరించాడట దర్శకుడు అనిల్ రావిపూడి. ఇది వరకూ కల్యాణ్ రామ్ తో ‘పటాస్’ వంటి హిట్ ను కొట్టిన ఈ దర్శకుడు బాలయ్య కోసం ‘రామారావు గారు’ కథను తయారు చేసుకున్నాడట.

టైటిల్ ఇలా ఉన్నా.. ఇది ఎన్టీఆర్ బయోపిక్ కాదు. ఇదో ఎంటర్టైనర్ అని, బాలయ్య ఇమేజ్ కు తగిన కథ అని తెలుస్తోంది. కథాంశం బాలయ్యకు నచ్చిందని, పూర్తి స్థాయి స్క్రిప్ట్ పూర్తి అయ్యాకా ఈ సినిమా పట్టాలెక్కుతుందని సమాచారం. తండ్రి పేరు మీద బాలయ్య సినిమా చేస్తే.. దానిపై అంచనాలు పతాక స్థాయికి చేరతాయని వేరే చెప్పనక్కర్లేదు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.