టాలీవుడ్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) నటించిన ‘వీరసింహా రెడ్డి’ (Veera Simha Reddy) మూవీ సంక్రాంతికి థియేటర్లలోకి రాబోతోంది. ఇప్పటికే విడుదలైన పాటలకి అభిమానుల నుంచి మంచి స్పందన లభించగా.. శుక్రవారం రాత్రి రిలీజైన ట్రైలర్ యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. జనవరి 12న రిలీజ్ కాబోతున్న వీరసింహా రెడ్డి మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ఒంగోలులో శుక్రవారం రాత్రి ప్రీరిలీజ్ ఈవెంట్‌ని చిత్ర బృందం నిర్వహించింది. ఈ పంక్షన్‌కి తొలుత అధికారులు పర్మీషన్ ఇవ్వడం ఆ తర్వాత ఏపీ ప్రభుత్వం కొత్త జీవో కారణంగా వేదిక మార్చుకోమని సూచించడంతో ఈవెంట్‌కి ముందే ఈ సినిమాకి పెద్ద ఎత్తున ప్రచారం లభించింది. ఒంగోలులో జరిగిన ఈ ప్రీరీలీజ్ ఈవెంట్‌కి బాలకృష్ణతో పాటు హీరోయిన్లు శృతి హాసన్, హనీ రోస్, విలన్ దునియా విజయ్, దర్శకుడు గోపీచంద్ మలినేని తదితరులు హాజరయ్యారు. ప్రత్యేక అతిథిగా బాలకృష్ణకి సమరసింహా రెడ్డి, నరసింహా నాయుడు లాంటి బ్లాక్బాస్టర్ హిట్స్ ఇచ్చిన సీనియర్ దర్శకుడు బి.గోపాల్ వచ్చారు. ఈ వేదికపై నుంచే వీరసింహా రెడ్డి ట్రైలర్‌ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఫుల్ మాస్ ఎంటర్టైనర్గా కనిపిస్తున్న ఈ ట్రైలర్‌కి రికార్డు స్థాయిలో వ్యూస్, లైక్స్ వస్తున్నాయి. ఓవరాల్‌గా యూట్యూబ్ ట్రెండింగ్‌లో ఈ ట్రైలర్ టాప్‌లో దూసుకెళ్తోంది.
వీరసింహా రెడ్డి ట్రైలర్ రిలీజ్ అయ్యి ఇప్పటికి 19 గంటలు అవగా.. ఏకంగా 5.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. అలానే 3,53,000 లైక్స్ వచ్చాయి. ఈ ట్రైలర్లో మాస్ ఆడియెన్స్‌ని మెప్పించేలా ఫైట్స్, ఎలివేషన్స్ ఉండటంతో పాటు ఆంధ్రప్రదేశ్ రాజకీయ పరిస్థితుల్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ బాలకృష్ణ పవర్ఫుల్ డైలాగ్స్ రెండు కనిపించాయి. అలానే శృతి హాసన్, హనీ రోస్తో కలిసి బాలయ్య వేసిన కొన్ని స్టెప్స్‌ని కూడా ఈ ట్రైలర్లో చూపించారు. ఈ మూవీలో బాలయ్య.. తండ్రి, కొడుకు రూపంలో రెండు పాత్రల్ని పోషిస్తున్నట్లు క్లారిటీగా చూపించేశారు.
నందమూరి బాలకృష్ణ ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ గతంలో చేసిన సినిమాలు ట్రెండ్‌ని సెట్ చేశాయి. సమరసింహా రెడ్డి, నరసింహా నాయుడు ఈ కోవకి చెందినవే. వీరసింహా రెడ్డి మూవీలో కూడా ఈ రెండు సినిమాల్ని గుర్తుకు తెచ్చేలా కొన్ని సీన్స్ ఉన్నట్లు ట్రైలర్‌ని చూస్తే అర్థమవుతోంది. సమరసింహా రెడ్డి తరహాలో బాలయ్య చేతిలో గొడ్డలి.. నరసింహా నాయుడు తరహాలో వరుసగా దుమ్ములేపుకొచ్చే సుమోలతో సీన్స్ ఉన్నట్లు ట్రైలర్లో చూపించారు. మరి సంక్రాంతికి ఈ ‘వీరసింహా రెడ్డి’ అభిమానుల్ని ఏ మేరకు అలరిస్తాడో చూడాలి.
Read Latest Telugu Movies News , Telugu News