యాప్నగరం

హీరోయిన్‌కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బాలకృష్ణ!

గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి చారిత్రాత్మక చిత్రం తర్వాత బసవతారకరామ పుత్ర బాలకృష్ణ 101వ సినిమా ఈమధ్యే..

Samayam Telugu 9 Apr 2017, 1:57 pm
గౌతమిపుత్ర శాతకర్ణి లాంటి చారిత్రాత్మక చిత్రం తర్వాత బసవతారకరామ పుత్ర బాలకృష్ణ 101వ సినిమా ఈమధ్యే సెట్స్‌పైకి వెళ్లిన సంగతి తెలిసిందే. పూరి జగన్నాథ్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో శ్రియ శరన్ ఒక హీరోయిన్‌గా కన్ఫర్మ్ అయింది. చెన్నకేశవ రెడ్డి, గౌతమిపుత్ర శాతకర్ణి వంటి చిత్రాల్లో బాలయ్య బాబుతో కలిసి నటించిన శ్రియ మరోసారి అతడి సినిమాలో లీడింగ్ లేడీ పాత్రకి ఎంపికైంది.
Samayam Telugu balakrishnas 101st movie will have shriya saran as female lead
హీరోయిన్‌కి ఇచ్చిన మాట నిలబెట్టుకున్న బాలకృష్ణ!


గౌతమిపుత్ర శాతకర్ణి చిత్రంలో శ్రియ కనబర్చిన నటనా ప్రతిభ బాలకృష్ణని బాగా ఇంప్రెస్ చేశాయట. అందుకే శ్రియకి మరో అవకాశం ఇస్తానని ఆమెకి మాట ఇచ్చారని, అప్పుడు చెప్పినట్టుగానే తాజాగా ఆమెనే తన 101వ సినిమాలోకి కూడా తీసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. మరో హీరోయిన్‌గా ముస్కాన్ ఎంపికైనట్టు సమాచారం. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ వున్న బాలకృష్ణ, బ్లాక్ బస్టర్ చిత్రాల దర్శకుడు పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న మొదటి సినిమా ఇదే కావడంతో ఇరువురి అభిమానుల్లోనూ అంచనాలకి కారణమవుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.