యాప్నగరం

రూ.1,00,100 వెచ్చించి బాలకృష్ణ సినిమా టికెట్ కొన్న ఫ్యాన్

నందమూరి బాలకృష్ణకి వున్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బాలయ్య...

Samayam Telugu 12 Jan 2017, 4:36 pm
నందమూరి బాలకృష్ణకి వున్న భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. బాలయ్య బాబు సినిమా రిలీజవుతోందంటే చాలు... ఆ సినిమాను ఫస్ట్ డే, ఫస్ట్ షో చూసేయ్యాలని పోటీపడేవాళ్లు ఎందరో. అందుకోసం ఎంతైనా వెచ్చించడానికి వెనుకాడని అభిమానులు కూడా ఉన్నారు బాలయ్య ఫ్యాన్ బేస్‌లో.
Samayam Telugu balakrishnas die hard fan buys gautamiputra satakarni ticket for rs 100100
రూ.1,00,100 వెచ్చించి బాలకృష్ణ సినిమా టికెట్ కొన్న ఫ్యాన్

తాజాగా సంక్రాంతి కానుకగా ఇవాళ రిలీజైన గౌతమిపుత్ర శాతకర్ణి మూవీపై నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలున్న నేపథ్యంలో ఈ సినిమా బెనిఫిట్ షో చూడటం కోసం ఓ వీరాభిమాని రూ.1,00,100 వెచ్చించి మరీ టికెట్ కొనుగోలు చేసినట్టు సమాచారం.

కూకట్‌పల్లి బ్రమరాంభ థియేటర్‌లో ఏర్పాటు చేసిన బెనిఫిట్ షో కోసం బాలయ్య బాబు వీరాభిమాని అయిన గోపీచంద్ రూ.1,00,100 చెల్లించి మరీ టికెట్ సొంతం చేసుకోగా ఆ టికెట్‌తో వచ్చిన మొత్తాన్ని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్‌కి డొనేట్ చేసినట్టుగా వార్తలొస్తున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.