యాప్నగరం

జై సింహా ట్రైలర్: టైమింగ్‌తో దూసుకొస్తున్న నటసింహం!

నట‘సింహం’ బాలకృష్ణ హీరోగా నటించిన 102వ చిత్రం ‘జై సింహా’ థియేట్రికల్ ట్రైలర్‌ విడుదలైంది. ఆదివారం (డిసెంబర్ 24) విజయవాడలో ఈ చిత్ర ఆడియో వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘జై సింహా’ ట్రైలర్‌ను విడుదల చేసింది.

TNN 24 Dec 2017, 9:55 pm
‘ఎవడ్రా వాడు.. ఆ కళ్లలో పవరేంటి.. ఎక్కడి నుంచి వచ్చాడు..’ అంటూ ఓ వ్యక్తి బ్యాక్‌డ్రాప్‌లో డైలాగ్‌ చెబుతుండగా.. డైనమిక్‌ ఎంట్రీ ఇచ్చారు నందమూరి నట‘సింహం’ బాలకృష్ణ. ఆయన హీరోగా నటించిన 102వ చిత్రం ‘జై సింహా’ థియేట్రికల్ ట్రైలర్‌ విడుదలైంది. ఆదివారం (డిసెంబర్ 24) విజయవాడలో ఈ చిత్ర ఆడియో వేడుక అట్టహాసంగా జరిగింది. ఈ సందర్భంగా చిత్ర బృందం ‘జై సింహా’ ట్రైలర్‌ను విడుదల చేసింది. ఇందులో బాలకృష్ణ తనదైన శైలిలో చెబుతున్న మాస్‌ డైలాగ్‌లు, యాక్షన్‌ ఆకట్టుకుంటున్నాయి.
Samayam Telugu balakrishnas jai simha theatrical trailer
జై సింహా ట్రైలర్: టైమింగ్‌తో దూసుకొస్తున్న నటసింహం!


‘సింహాన్ని చంపాలంటే ట్రైనింగ్‌ తీసుకోవాలి. నరసింహాన్ని కొట్టాలంటే టైమింగ్‌ తెలిసుండాలి’ అంటూ బాలకృష్ణ చెప్పిన డైలాగ్ ఆసక్తిగా ఉంది. ‘సింహం మౌనాన్ని సన్యాసం అనుకోవద్దు’, ‘నేనంటే రెండు రాష్ట్రాలకూ ప్రాణం’ అంటూ చెప్పిన డైలాగ్‌లు కూడా అద్భుతం. నయనతారతో నందమూరి ప్రేమ సన్నివేశాలను కూడా దర్శకుడు కె.ఎస్‌.రవికుమార్‌ ఆకట్టుకునేలా తీర్చిదిద్దినట్లు కనిపిస్తోంది.

‘నీకు వయసు అవదు కదా! జీవితాంతం డ్యుయెట్లు పాడుకుంటూ ఉండవచ్చు.. కానీ, నాకు వయసు అయిపోతోంది. పెళ్లి చేసుకుని పిల్లల్ని కని వాళ్లతో ఆడుకోవాలని ఉంది’ అంటూ నయనతార చెప్పే డైలాగ్‌ కూడా అలరిస్తోంది. నయన్‌తో పాటు సినిమాలో హరిప్రియ, నటాషాదోషి కథానాయికలుగా నటిస్తున్నారు.

చిరంతన్‌ భట్‌ సంగీతం సమకూర్చిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, ప్రకాష్‌రాజ్‌, జగపతిబాబు, మురళీమోహన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సీకే ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై సి.కల్యాణ్‌ నిర్మిస్తున్న ఈ సినిమాను సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.